బన్నీ సినిమా టీజర్ పై ఎన్టీఆర్ కామెంట్

కిక్, రేసు గుర్రం, టెంపర్ వంటి హిట్ చిత్రాలకి కథ అందించిన వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న సినిమా ‘నా పేరు సూర్య’. ఈ సినిమాలో అల్లు అర్జున్ సోల్జెర్ గా నటిస్తున్నారు. శ్రీధర్ లగడపాటి నిర్మిస్తోన్న ఈ సినిమా ఫస్టు ఇంపాక్ట్ రీసెంట్ గా రిలీజ్ అయి విశేష స్పందన అందుకుంది. అల్లుఅర్జున్ ని కోపం ఎక్కువగా ఉండే వ్యక్తిగా వంశీ చూపించిన విధానానికి అందరూ ప్రశంసిస్తున్నారు. ఈ టీజర్ ని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చూసారని సమాచారం. అంతేకాదు చూసిన వెంటనే డైరక్టర్ వంశీ కి మెసేజ్ కూడా పెట్టినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. “ఫస్టు ఇంపాక్ట్ చాలా బాగుంది .. బన్నీ బాగా చేశాడు” అని ఎన్టీఆర్ ప్రశంసించినట్లు వెల్లడించారు. నిజానికి వంశీ కి మాటయిచ్చి బాబీతో సినిమా చేయడంతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది.

ఆ కోపంతోనే వంశీ అల్లు అర్జున్ తో సినిమా మొదలు పెట్టారు. అంతే కసిగా సినిమాని తీస్తున్నారు. ఇది ఎన్టీఆర్ కథనే అని చెప్పేవారు లేకపోలేదు. ఏదిఏమైనా ఎన్టీఆర్ నుంచి మెసేజ్ రావడం వంశీ తో పాటు.. చిత్ర బృందం మొత్తం ఆనందంగా ఉంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా సంతోషపడుతున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా వక్కంతం వంశీతో ఎన్టీఆర్ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఆనందపడుతున్నారు. చాలా రోజుల తర్వాత మెగా బ్రదర్ కె నాగేంద్రబాబు సమర్పిస్తున్న ఈ చిత్రంలో శరత్ కుమార్ ఓ కీలక రోల్ పోషిస్తున్నారు. అల్లు అర్జున్, శరత్ కుమార్ కలిసి నటించిన బన్నీ మూవీ రికార్డులను తిరగరాసింది. మళ్ళీ కాంబినేషన్ సెట్ కావడంతో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus