యంగ్ టైగర్ ఎన్టీఆర్ కోసం కథలు రాయడం అప్పటి స్టైల్.. స్టోరీ తగ్గట్టు తారక్ మారిపోవడం ఇప్పటి స్టైల్. స్టార్ ఇమేజ్ ని పక్కన పెట్టి సరికొత్త కథలను ఎంచుకోవడమే కాదు.. అందులోని పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఎన్టీఆర్ వంద శాతం శ్రమిస్తున్నారు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ చిత్రాల్లో క్యారక్టర్ కి తగినట్లు మారిపోయి సూపర్ హిట్ సొంతం చేసుకున్నారు. తన 27 చిత్రానికి కూడా అదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఇదివరకు అయితే ఒకే పాత్ర కాబట్టి కొంచెం కష్టపడితే సరిపోతుంది. బాబీ దర్శకత్వంలోచేయనున్న మూవీలో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో మెప్పించాల్సి ఉంటుంది.
అందుకే మూడు వేరియేషన్ చూపించడానికి సిద్ధమయ్యారు. ఒక పాత్ర చాలా స్లిమ్ గా స్టైలిష్ గా ఉంటుందంట.. అందుకోసం బరువు తగ్గడానికి కసరత్తు ప్రారంభించారు. రెండు రోజులుగా జిమ్ లో ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలిసింది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 10న పూజా కార్యక్రమాలు జరుపుకొని 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది. రాశీఖన్నా, నివేదా థామస్‌లను హీరోయిన్లుగా ఎంపికైన ఈ ఫిల్మ్ కి ‘జై లవకుశ’ అనే పేరు పరిశీలిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.