Jr NTR: ఆరు నెలల్లో పూర్తి చేయడం సాధ్యమేనా?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చరణ్ తో కలిసి రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ ఎప్పుడు రిలీజవుతుందో ఆ సినిమా మేకర్స్ సైతం కచ్చితంగా చెప్పలేకపోతున్నారు. ఎన్టీఆర్ తర్వాత సినిమాకు కొరటాల శివ డైరెక్టర్ గా ఫిక్స్ ఆయ్యారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రెండు వారాల తర్వాత మొదలు కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ ను సైతం ఇప్పటికే ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 29వ తేదీన కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను రిలీజ్ చేయాలని ఎన్టీఆర్ భావిస్తున్నారు.

అయితే ఆ తేదీకి సినిమాను రిలీజ్ చేయడం సాధ్యమేనా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ పాన్ ఇండియా మూవీ కావడంతో కేవలం ఏడు నెలల్లో షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను రిలీజ్ చేయడం సాధ్యం కాదు. ఇతర భాషల నటులు సైతం తారక్ మూవీలో నటిసున్న నేపథ్యంలో ఆయా భాషల నటీనటుల డేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. ఎన్టీఅర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పటికే మూడుసార్లు వాయిదా పడటంతో తారక్ ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు.

కొరటాల శివ సినిమా విషయంలో కూడా అదే విధంగా జరిగితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కొరటాల శివ సోషల్ మీడియాకు దూరంగా ఉండటంతో ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కూడా ఫ్యాన్స్ కు తెలియడం లేదు. తారక్ సినిమాల విషయంలో వేగం పెంచాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus