కలల ప్రాజెక్ట్ కోసం కష్టపడుతున్న ఎన్టీఆర్
- August 18, 2017 / 01:47 PM ISTByFilmy Focus
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించాలనేది ఎన్టీఆర్ డ్రీమ్. ఆ కల త్వరలో నెరవేరనుంది. వీరి కలయికలో సినిమా నవంబర్ లో మొదలుకానుంది. ఇది కుటంబ కథా చిత్రం కావడంతో స్లిమ్ కావాలని డైరక్టర్ చెప్పడంతో ఆ పని ప్రారంభించినట్లు సమాచారం. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ డైరక్షన్లో జై లవ కుశ సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయింది. రెండు పాటలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో తర్వాతి సినిమా కోసం కష్టపడడం మొదలెట్టారు.
ఫిట్ నెస్ నిపుణుల సలహా మేరకు బరువు తగ్గడానికి పనికొచ్చే ఆహార పదార్ధాలు తీసుకుంటున్నారు. కాలేజీకెళ్లే కుర్రోడిగా తారక్ ఈ సినిమాలో కనిపిస్తారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇదివరకు ఎన్నడూ చూడని విధంగా తారక్ ని త్రివిక్రమ్ చూపిస్తాడనడంలో ఎటువంటి సందేహాం అవసరం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















