టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ దూకూడుకి కళ్ళెం వెయ్యడం చాలా కష్టం…అయితే అదే క్రమంలో ఆ మధ్య హిట్స్ విషయంలో కాస్త వెనుకబడ్డ ఆ తరువాత సూపర్ హిట్స్ తో ఇండస్ట్రీకి మళ్ళీ తన స్టామినాని రుచి చూపించాడు ఎన్టీఆర్….అయితే అదంతా పక్కన పెడితే….నిన్న జూనియర్ దర్శకుడు బాబి కాంబినేషన్ లో ప్రారంభం అయిన ‘జై లవ కుశ’ మూవీ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది…అయితే సినిమా ముహూర్తం సూపర్ గా జరిగినప్పటికీ…అక్కడ వినిపించిన కొన్ని ఆసక్తికర కామెంట్స్ ఇప్పుడు టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ద టౌన్ గా మారాయి….విషయంలోకి వెళితే…నిన్న జరిగిన ప్రారంభోత్సవంలో జూనియర్ ఫిజిక్ ను చూసిన వారు కొన్ని ఆ శక్తికర కామెంట్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కొత్త మూవీ కోసం జూనియర్ బాగా ఒళ్ళు తగ్గించి కనిపించబోతున్నాడని దానికోసం గంటలగంటలు తన పర్సనల్ జిమ్ లో కష్టపడుతూ కొత్త లుక్ కోసం శ్రమపడుతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే నిన్న కొత్త సినిమా ప్రారంభోత్సవం రోజున జూనియర్ చూసిన చాలామంది అదేంటి….చాలా విన్నాం…జూనియర్ ఫిజిక్ గురించి…కానీ తారక్ ఎప్పటిలాగే మామూలుగానే ఉన్నాడు అని కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. గతంలో ‘టెంపర్’ సినిమా కోసం ఫిట్‌గా కన్పించిన ఎన్టీఆర్, ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో ఫర్వాలేదన్పించాడు.అయితే ‘జనతా గ్యారేజ్’ సినిమాకొచ్చేసరికి ఒళ్ళు చేసేశాడు అన్న కామెంట్స్ వినిపించాయి. దీనితో జూనియర్ ‘జై లవ కుశ’ కోసం సన్నపదతాడు అన్న ప్రచారం జరిగింది. బాగా కసరత్తులు చేస్తూ బాగా ఒళ్ళు తగ్గించేస్తున్నాడని రూమర్స్ వచ్చినా వాటితో సంబంధం లేకుండా జూనియర్ యధాతధంగానే కనిపించాడు. అయితే ఈ సినిమా ఎన్టీఆర్ 3 డిఫరెంట్ రోల్స్ చేస్తూ ఉండడంతో ఏ పాత్ర ఎలా ఉండబోతుందో చూడాలి మరి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.