అభిమానులతో ముచ్చటించిన కాజల్

  • October 8, 2016 / 12:46 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆల్ రౌండర్ అని టాలీవుడ్ యువరాణి కాజల్ చెప్పింది. ఈమె తారక్ తో కలిసి బృందావనం, బాద్ షా, టెంపర్ సినిమాల్లో నటించింది. జనతా గ్యారేజ్ లోను స్పెషల్ సాంగ్ కి డ్యాన్స్ చేసి అదరగొట్టింది. ఈ ముంబై ముద్దగుమ్మ శనివారం సోషల్ మీడియా వేదికపై అభిమానులతో ముచ్చటించింది. వారు అడిగిన అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. తారక్ గురించి ఒక మాటలో చెప్పమని ఆయన ఫ్యాన్స్ కోరగా “ఆల్ రౌండర్” అని చెప్పింది. “ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 సినిమాలో చిరు సరసన నటిస్తున్నాను.

దీని తర్వాత తేజ దర్శకత్వంలో రానున్న చిత్రంలో రానాకు జతగా కనిపించనున్నాను. తమిళంలో “తల 57″ మూవీలో నటిస్తున్నాను” అని తన తాజా ప్రాజక్ట్ ల గురించి వివరించింది. తనని ముద్దుగా అందరూ కాజు అని పిలుస్తుంటారని తెలిపింది. “నేను పోషించిన అన్నీ పాత్రల్లో మగధీరలో ఇందు క్యారక్టర్ బాగా ఇష్టం. నా రియల్ లైఫ్ కి చాలా దగ్గరిగా ఉంటుంది” అని కాజల్ వెల్లడించింది. తమిళంలో జీవాతో కలిసి నటించిన “కవలై వెందామ్” రిలీజ్ డేట్ త్వరలోనే ప్రకటించనున్నట్లు ట్వీట్ చేసింది. మీ  పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్నకు కాజల్ స్పందిస్తూ.. “పెళ్లి ఘడియలు దగ్గరకు వచ్చినప్పుడు అదే జరుగుతుంది.. దాని గురించి ఇప్పుడే ఏమి చెప్పలేను” అని వేదాంత ధోరణిలో మాట్లాడింది.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus