Jr NTR, Koratala Siva: తారక్ కొరటాల మూవీ షూట్ మొదలయ్యేది అప్పుడేనట?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమాకు సంబంధించి గతేడాది ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే. అయితే ఆచార్య సినిమా డిజాస్టర్ రిజల్ట్ ను అందుకోవడంతో ఈ సినిమాకు సంబంధించి మార్పులుచేర్పులు మొదలయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మొదలుకావాల్సి ఉన్నా వేర్వేరు కారణాల వల్ల మొదలుకాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడానికి కథే కారణమని సమాచారం. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటించే సినిమా అంతకంతకూ ఆలస్యం కావడంతో ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.

గతంలో కొరటాల శివ అనుకున్న కథను పక్కన పెట్టాడని ప్రస్తుతం కొరటాల శివ కొత్త పాయింట్ తో కథ సిద్ధం చేస్తున్నారని బోగట్టా. ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కథలో కొంతభాగం సముద్రంలో, షిప్ లలో కూడా షూట్ చేయనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. మాఫియా బ్యాక్ డ్రాప్ లో కొరటాల శివ ఈ సినిమాను సిద్ధం చేశారని కొరటాల శివ గత సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని తెలుస్తోంది.

యాక్షన్ జానర్ లో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనున్నారని సమాచారం. ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతున్నా ఆ ఆలస్యానికి తగ్గ ఫలితం అయితే దక్కుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. కొరటాల శివ ఈ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకోవాలని అనుకుంటున్నారు. యాక్షన్ జానర్ లో పాన్ ఇండియా సినిమాగా ఈ సినిమా తెరకెక్కితే సినిమా సక్సెస్ సాధించే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే.

తారక్ కొరటాల శివ కాంబో కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. 150 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus