విజయానందంలో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్

టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలు వరుసగా విజయం సాధించడంతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విజయానందంలో ఉన్నారు. చాలా కాలం తర్వాత తన పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవడంతో ఫుల్ జోష్ తో కనిపిస్తున్నారు. మొన్న జరిగిన అన్న కళ్యాణ్ రామ్ హీరో గా తెరకెక్కిన ‘ఇజం‘ ఆడియో ఫంక్షన్ కి హాజరైన తారక్ సెంటర్ అఫ్ ది ఎట్రాక్షన్ గా మారారు. జనతా గ్యారేజ్ లో కనిపించిన గడ్డం లుక్ నే మైంటైన్ చేస్తూ ఆకర్షించారు.

అయితే ఇప్పుడు కొంచెం మీసం పెంచారు. మీసంపై చెయ్యి వేసి.. మెలేస్తుంటే కెమెరా మెన్లు వేగంగా ఫోటోలు తీశారు. ఈ ఫోటోలు చూసి నందమూరి అభిమానులు తెగ సంతోష పడుతున్నారు. ఆది సినిమాలో తొడగొట్టరా చిన్నా అనే సీన్ కి ఎంత రెస్పాన్స్ వచ్చిందో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ మీసం మెలి తిప్పే ఫోటోకి అంతే స్పందన వచ్చింది. విపరీతమైన లైక్లు, షేర్లు అందుకుంటోంది. తారక్ చేయనున్న సినిమాలో ఇటువంటి సన్నివేశం ఉంటుందని, అందుకే మీసం, గడ్డం తీయకుండా ఉన్నాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరో వారి అంచనా నిజమవుతుందో.. లేదో .. కొన్ని రోజుల్లో తెలియనుంది.

NTR Funny Speech at ISM Audio Launch - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus