డైలమాలో యంగ్ టైగర్ నెక్స్ట్ మూవీ!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి ఊపు మీద ఉన్నాడు…దాదాపుగా వరుసగా మూడు హిట్స్ కొట్టి….హ్యాట్రిక్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు మన యంగ్ టైగర్. ఇదిలా ఉంటే ఇంతవరకూ బాగానే ఉంది అసలు విషయం ఏమిటంటే….ఇప్పుడు ఎన్టీఆర్ ఈ సినిమా తరువాత అసలు ఏ సినిమా చేస్తున్నాడు? ఏ దర్శకుడితో సినిమా చేస్తున్నాడు? ఎన్టీఆర్ తరువాత సినిమా ఏంటి అన్న అనుమానం ఫాన్స్ లో నెలకొంది. కొందరు ఎన్టీఆర్ తమిళ దర్శకుడు లింగుస్వామి చెప్పిన కధ నచ్చి ఆయనతో ఒక సినిమా చేస్తున్నాడు అని కొందరు అంటుంటే….కాదు కాదు….అనిల్ రావిపూడి తయారు చేసిన బ్లయిండ్ పర్సన్ స్టోరీతో ఎన్టీఆర్ సాహసం చేస్తున్నాడు అని కొందరు అంటున్నారు.

ఇవన్నీ కాకుండా పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో ఒక పవర్‌ఫుల్ యాక్షన్ మూవీ చేయనున్నాడు అని కొందరు చెబుతున్నారు. ఇదిలా ఉంటే టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న విషయం ప్రకారం ఎన్టీఆర్ తరువాత సినిమా పూరితో చేస్తాడు అని చెబుతున్నప్పటికీ కల్యాణ్ రామ్ ఇజమ్ సినిమా రిసల్ట్ చూసి పూరికి ఎన్టీఆర్ అవకాశం ఇవ్వాలి అని చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఆ సినిమాను ఎడిటింగ్ రూములో ఎన్టీఆర్ చూసినప్పటికీ…ఇప్పుడు పైనల్ గా ప్రేక్షకులు ఎలాంటి రిజల్టును ఇస్తారో మాత్రం తెలియదు. కళ్యాణ్ రామ్ సినిమా ట్రైలర్ అదిరిపోయినా.. సినిమా రిసల్ట్ ఎలా ఉంటుందో అన్న ఆలోచనలో ఉన్నారు చిత్ర యూనిట్. అందుకే సినిమా రిజల్టు చూశాకే ఈ ప్రాజెక్టు మీద ఫిక్సవుదాం అని తేల్చేశాడట తారక్. మరి ఇదే నిజం అయితే ఎన్టీఆర్ తరువాత సినిమా ఫిక్స్ అవడానికి ఇంకా టైమ్ పడుతుంది అని చెప్పక తప్పదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus