మళ్ళీ మాస్ బాట పట్టిన ఎన్టీఆర్!!!

  • December 18, 2016 / 05:16 AM IST

టాలీవుడ్ లో యంగ్ టైగర్ స్థానాన్ని ఎవరూ టచ్ చెయ్యాలేరు అనే చెప్పాలి. అసలితే టాలీవుడ్ లో నడుస్తున్న హీరోల హిట్స్ ఫ్లాప్స్ విషయంలో ఎన్టీఆర్ కు గతంలో పెద్ద హిట్స్ ఏమీ లేకపోగా…వరుస పరాజయాలతో ఇబ్బందులు పడ్డాడు…అయితే పులి ఒక్క అడుగు వెనక్కి వేస్తే వంద అడుగుల సమానంగా దూసుకెళ్తుంది అన్నట్లుగా వరుసగా హ్యాట్రిక్ హిట్స్ తో దూసుకెళ్తున్నాడు మన యంగ్ టైగర్…టెంపర్..నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ తో సూపర్ హిట్స్ అందుకుని, భారీ వసూళ్లతో టాప్ వసూళ్లు సాధించిన హీరోల లిస్ట్ లో చోటు సాధించుకున్నాడు…

అయితే అదే క్రమంలో…ఎన్టీఆర్ కి తీరని కోరిక ఒకటి మిగిలిపోయింది, అదేమిటి అంటే…సింహాద్రి తరవాత ఆ రేంజ్ లో భారీ హిట్ కొట్టాలి అని. సింహాద్రి ఎంతటి హిట్ సినిమానో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. అంతేకాకుండా ఆ సినిమా అతని కెరీర్ లో కనీ వినీ ఎరుగని బ్లాక్ బస్టర్ అని చిన్న పిలాన్ని అడిగిన చెప్తాడు….ఇక ఆ తరువాత అలాంటి హిట్ కోసం ఎన్టీఆర్ ఎంత ప్రయత్నించినా వీలు కాలేదు…సాక్షాతు రాజమౌళి దర్సకత్వం లో వచ్చిన యమదొంగ కూడా ఎన్టీఆర్ కి సింహాద్రి రేంజ్ హిట్ ని ఇవ్వలేకపోయింది. అదుర్స్ లాంటి అరాకొరా సినిమాలు కెరీర్ గ్రాఫ్ లో హిట్ శాతం పెంచాయి కానీ అతని లక్ష్యాన్ని మాత్రం చెరువు అవ్వనివ్వలేదు. వరసగా టెంపర్ , నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ లు వరస హిట్ లు కొట్టినా కూడా అవన్నీ దాదాపు క్లాస్ టచ్ ఉన్న కంటెంట్ లు.

అయితే ఇప్పుడు ఆ కోరికను ఎన్టీఆర్ తన రాబోయే సినిమాతో తీర్చుకోబొతున్నాడు అని టాలీవుడ్ టాక్…బాబీతో రాబోతున్న సినిమా ఫుల్ మసాలా మాస్ ఎలిమెంట్స్ తో దుమ్ము రేపుతుంది అని సమాచారం. ఒకే సినిమాలో మూడు క్యారెక్టర్స్ అన్న కాన్సెప్ట్ ఒక్కటి చాలు… ఏ స్టార్ హీరో అభిమానులకైనా సూపర్ కిక్ ఇచ్చేస్తుంది. అసలే మన ఎన్టీఆర్ ఊర మాస్….అలాంటిది మన వాడికి మాస్ మసాలా స్టోరీ పడితే…ఫ్యాన్స్ కి పండగే పండగ…మరి బాబీ ఎన్టీఆర్ ను ఎలా చూపిస్తాడో చూద్దాం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus