యంగ్ టైగర్ ఎన్టీఆర్...స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్....వీళ్ళిద్దరూ ఇండస్ట్రీలో టాప్ హీరోస్ అని అనడంలో ఏమాత్రం సందేహం లేదు...అయితే అదే క్రమంలో ఈ హీరోలు తమ తమ సినిమాలతో హిట్స్ ఇచ్చుకుంటూ దూసుకుపోతున్నారు...ఇక ఈ కుర్ర హీరోలకు మాస్ లో ఉన్న ఇమేజ్ అంతా ఇంతా కాదు...ఆ క్రమంలోనే ఈ సినిమాలకు ఉన్న మాస్ ఇమేజ్ పుణ్యమా అని బిజినెస్ సైతం భారీ స్థాయిలోనే జరుగుతూ ఉంటుంది...ఇదిలా ఉంటే.....తాజాగా...ఎన్టీఆర్ సూపర్ సక్సెస్ ట్ర్యాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.... అయితే ఆ తరువాత ఎన్టీఆర్ ఈ సినిమా చెయ్యాల అన్న ఆలోచనలో ఉన్నాడు...అదే క్రమంలో తమిళ దర్శకుడు లింగు స్వామి చెప్పిన కధ నచ్చి అతన్ని లైన్ లో పెట్టాడు....కానీ ఏమ్ జరిగిందో ఏమో కానీ...సడన్ గా లింగు స్వామి ఎన్టీఆర్ కు హ్యాండ్ ఇచ్చి...బన్నీతో సినిమా చేస్తున్నాడు....ఇదే కధని...గతంలో మహేష్ బాబుకు చెప్పాడు దర్శకుడు...ఆయన నుంచి పెద్దగా రెస్పాన్స్ ఏమీ రాకపోవడంతో చేసేది ఏమీ లేక లైట్ తీసుకున్నాడు...ఇక ఎన్టీఆర్ కు చెప్పగా... అందులో కొన్ని మార్పులు చేసి..ఆ కథని డెవలెప్ చేయాల్సిందిగా చెప్పాడంట మన ఎన్టీఆర్...కానీ ఇంతలో ఏమైందో తెలియదు కానీ...జూనియర్ ను లింగుస్వామి వదిలి బన్నీని పట్టుకున్నాడు. ఇప్పుడు లింగుస్వామి..బన్నీ కాంబినేషన్ సెట్ అయింది. ఈ విషయం తెలియగానే ఎన్టీఆర్ చాలా షాక్ అయ్యాడని తెలుస్తుంది. ఇక బన్నీ...లింగూస్వామి సినిమాని స్టూడియో గ్రీన్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం...