జై లవకుశ సినిమాపై వచ్చిన వార్తలను ఖండించిన చిత్ర బృందం!

ఎన్టీఆర్ తొలిసారి త్రి పాత్రాభినయం చేసిన జై లవకుశ చిత్రం రిలీజ్ కి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. అయినా ఇప్పుడే జై లవకుశ ఫీవర్ మొదలయిపోయింది. ఎక్కడైనా ఈ మూవీ గురించే మాట్లాడు కుంటున్నారు. ఎన్టీఆర్ నటన గురించి పాజిటివ్ విషయాలతో పాటు కొన్ని నెగిటివ్ వార్తలు కూడా ఫిలింనగర్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ మూవీలో జై … తెలుగు దేశం పార్టీని టార్గెట్ చేస్తూ పొలిటికల్ పంచ్ డైలాగ్స్ వేసాడని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు జనసేన నేత పవన్ కళ్యాణ్ ఫై కూడా ఎన్టీఆర్ ఇండైరెక్ట్ గా కామెంట్ చేసాడని సోషల్ మీడియాలో వార్త విహారం చేస్తోంది.

ఈ విషయాలు తెలుసుకున్న చిత్ర బృందం స్పందించింది. ఈ వార్తల్లో నిజం లేదని, ఇలాంటి వార్తలు అసలు నమ్మవద్దని చెప్పింది. కొంతమంది సినిమా కలక్షన్స్ తగ్గాలని ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని వెల్లడించింది. సినిమాలో ఏ పార్టీపైనా పంచ్ లు వేయలేదని స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ అంటే బాబీకి అభిమానమని.. అందుకే   అతని ప్రస్తావన సినిమాలో తీసుకురాలేదని వివరించింది. ఇకనుంచి అయినా ఈ వార్తలకు అడ్డు పడుతుందేమో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus