నెక్స్ట్ సినిమా విషయంలో ఫ్యాన్స్ కి క్లారిటీ ఇచ్చిన ఎన్టీఆర్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లేకుంటే అభిమానులతో కలిసి సరదాగా గడుపుతుంటారు. తన సినిమా విషయాల గురించి చెబుతుంటారు. అలాగే వారి సలహాలను సూచనలను తీసుకుంటుంటారు. ఈ సారి అభిమానులు అనేక అనుమానాలను తారక్ ముందు ఉంచారు. త్రివిక్రమ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి ఫెయిల్ కావడంతో.. ప్రస్తుతం కథలో ఎన్టీఆర్ మార్పులు చేయించినట్లు… అలాగే బరువు బాగా తగ్గుతున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఎన్టీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ వార్తలను ఎన్టీఆర్ ఖండించారు. అవన్నీ పుకార్లేనని తారక్ తన ఫ్యాన్స్ కి చెప్పినట్లు తెలిసింది. కథ, డైరక్షన్ విషయంలో గురువు గారికి ఎటువంటి సలహాలు తాను ఇవ్వడం లేదని స్పష్టం చేసినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

ఇంకా బరువు గురించి మాట్లాడుతూ.. తాను పాత్రకోసం కొన్ని కిలోల బరువు తగ్గడానికి ఫిట్ నెస్   నిపుణుల సలహాలు తీసుకుంటున్న విషయం నిజమే కానీ.. మరీ పది కిలోలు తగ్గడం లేదని వెల్లడించారని టాక్. అలాగే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందా? అని అభిమానులు ఎన్టీఆర్ ఆతృతగా ఉన్నట్లు తెలిసింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధా కృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకి తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ సంగీతాన్ని ఇస్తున్నారు. ఇందులో ఎన్టీఆర్ కి జోడీని వెతికే పనిలో చిత్ర బృందం ఉంది. అంతా క్లియర్ అయితే వచ్చే నెల చివర్లో ఈ చిత్రం పట్టాలెక్కనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus