జై క్యారెక్టర్ నుంచి బయటపడలేకపోయాను..!

క్యారెక్టర్ లోకి పరకాయ ప్రవేశం చేసి.. సదరు పాత్రలో నటించడం కాక జీవించి, బిహేవ్ చేసే అతికొద్ది మంది నటుల్లో మన జూనియర్ ఎన్టీయార్ ఒకడు. పాత్ర స్వభావాన్ని అర్ధం చేసుకోవడంతోపాటు.. షూటింగ్ జరుగుతున్నన్నాళ్లూ ఆ పాత్రలో లీనం అవ్వడం అనేది ఎన్టీయార్ కు మొదటినుంచి అలవాటు. ఆ అలవాటుతోనే తాజా చిత్రమైన “జై లవకుశ”లోని జై క్యారెక్టర్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయాడట. ఎంతలా అంటే ఆ క్యారెక్టర్ లాగే నత్తిగా మాట్లాడడం, కోప్పడడం లాంటివి చేసేవాడట. ఒక్కోసారి నిద్ర మధ్యలో లేచి గట్టిగా అరిచేవాడట. ఇంకోసారి ఏకంగా కిటికీలో నుండి దూకేయబోయాడట. అదే టైమ్ కి ఆయన సతీమణి లక్ష్మీ ప్రణతి గట్టిగా అరవడంతో వెనక్కి తిరిగాడట.

మరి ఎన్టీయార్ ఇంతలా ఇన్వాల్వ్ అయ్యి పోషించిన జై పాత్ర సినిమాకి చాలా కీలకమని దర్శకనిర్మాతలు మొదలుకొని రైటర్స్ వరకూ అందరూ మొదట్నుంచీ చెబుతూనే ఉన్నారు. మరి ఇంతలా హైప్ క్రియేట్ చేసిన జై క్యారెక్టర్ తోపాటు “జై లవకుశ” సినిమా ప్రేక్షకుల్ని ఏమేరకు అలరిస్తుందో చూడాలి. ఎక్కువ టైమ్ గ్యాప్ కూడా లేదు లెండి ఇంకో మూడు రోజులు మాత్రమే మిగిలి ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus