NTR,Hrithik Roshan: పవర్ ఫుల్ విలన్ పాత్రలో ఎన్టీఆర్… ఫ్యాన్స్ కు పూనకాలే!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. RRR సినిమా తరువాత ఎన్టీఆర్ తన తదుపరి చిత్రాన్ని కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రస్తుత ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ నటిస్తున్నటువంటి వార్ 2 సినిమా ద్వారా మరోసారి విలన్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇప్పటికే (NTR) ఎన్టీఆర్ జై లవకుశ సినిమాలో విలన్ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే అయితే మరోసారి ఈ సినిమాలో విలన్ పాత్రలో ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమయ్యారని తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించుకోబోతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ పాత్ర ఎంతో అద్భుతంగా ఉండబోతుందని తెలుస్తుంది.

అయితే ఈయన పాత్రకు మించి ఎన్టీఆర్ పాత్ర ఉండబోతుందని సమాచారం. ఈ సినిమాలో ఎన్టీఆర్ పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇలా ఎన్టీఆర్ నెగిటివ్ రోల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని ఈ పాత్ర భారీగా ఉండబోతుందన్న వార్త తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇలా ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సినిమాపై కూడా భారీగానే అంచనాలు పెరిగిపోయాయి.ఇక త్వరలోనే ఈ సినిమాలో పాల్గొనడం కోసం తాను ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నాను అంటూ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ కూడా ఈ సినిమా గురించి తెలియజేశారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus