బాబీ ని ఆనందంలో ముంచిన ఎన్టీఆర్
- March 1, 2017 / 08:00 AM ISTByFilmy Focus
సినిమా హిట్ అయితే డైరక్టర్ కి హీరో కానుకలు ఇవ్వడం ఆనవాయితీ .. బట్ ఫర్ ఏ చేంజ్ .. సినిమా ప్రారంభానికి ముందే డైరక్టర్ కి గిఫ్ట్ ఇవ్వడం ఎన్టీఆర్ స్టైల్. యంగ్ టైగర్ జనతా గ్యారేజ్ చిత్రం తర్వాత బాబీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ తారక్ లేకుండా జరుగుతోంది. ఇందులో ఎన్టీఆర్ మూడు పాత్రల్లో నటవిశ్వరూపం ప్రదర్శించనున్నారు. అందుకు వేరియేషన్ ఉండేలా మేకోవర్ పై తారక్ దృష్టి పెట్టారు. జిమ్ ల్లో కసరత్తు చేస్తున్న ఎన్టీఆర్ హఠాత్తుగా బాబీ వద్దకు వచ్చి ఖరీదైన గిఫ్ట్ ని ఇవ్వడం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయింది.
4 లక్షల ఖరీదైన వాచీని ఇవ్వడంతో డైరక్టర్ ఆనందంలో మునిగిపోయారని తెలిసింది. అద్భుతమైన కథను అందించినందుకు ఈ కానుకను బాబీకి ఎన్టీఆర్ ప్రజెంట్ చేసినట్లు సమాచారం. హాలీవుడ్, బాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్న ఈ మూవీకి జై లవకుశ అనే పేరుని పరిశీలిస్తున్నారు. హ్యాట్రిక్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















