Jr NTR: మీ ప్రేమకు రుణపడి ఉంటా.. ఎన్టీఆర్ కామెంట్స్!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎన్టీఆర్ ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ బయటకు వచ్చాయి. నిన్న కొరటాల శివ డైరెక్ట్ చేయనున్న సినిమా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈరోజు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న సినిమా ప్రీలుక్ ను రివీల్ చేశారు. ఈ రెండు అప్డేట్స్ అభిమానులు మంచి ట్రీట్ అనే చెప్పాలి. ప్రస్తుతం ఈ అప్డేట్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

సినీ సెలబ్రిటీలు, అభిమానులు.. ట్విట్టర్ వేదికగా ఎన్టీఆర్ కి బర్త్ డే విషెస్ చెబుతున్నారు. వీరిని ఉద్దేశించి ఎన్టీఆర్ ఓ లెటర్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘థాంక్యూ’ అంటూ క్యాప్షన్ ఇస్తూ ఈ లెటర్ ను రాసుకొచ్చారు. ”నాకు విషెస్ చెప్పిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, శ్రేయోభిలాషులు, ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలానే నాకు శుభాకాంక్షలు చెప్పడానికి ఇంటివరకు వచ్చిన అభిమానులకు కృతజ్ఞతలు.

నా మీద మీరు కురిపిస్తోన్న ప్రేమ ఈ పుట్టినరోజుని మరింత స్పెషల్ గా మార్చింది. నేను ఇంట్లో లేకపోవడం వలన మిమ్మల్ని కలవలేకపోయాను. క్షమించండి. మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ లెటర్ వైరల్ అవుతోంది. ఈ పుట్టినరోజుని ఎన్టీఆర్ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరికొద్దిరోజుల్లో ఆయన కొరటాల శివ సినిమాను మొదలుపెట్టనున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘తొలిప్రేమ’ టు ‘ఖుషి’.. రిపీట్ అవుతున్న పాత సినిమా టైటిల్స్ ఇవే..!
ఈ 12 మంది మిడ్ రేంజ్ హీరోల కెరీర్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సౌత్ స్టార్స్ తమ బాలీవుడ్ ఎంట్రీ పై చేసిన కామెంట్స్ ఏంటంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus