ఎన్టీఆర్ తన కెరీర్ లో అత్యధిక కలక్షన్ల సాధించిన సినిమాగా జనతా గ్యారేజ్ నిలిచింది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 135 కోట్లు వసూలు చేసి తారక్ కి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చింది. కాబట్టి అదే డైరక్టర్ తో మళ్ళీ మూవీ చేసేందుకు ఎన్టీఆర్ సిద్ధమయినట్లు తెలిసింది. ప్రస్తుతం తారక్ బాబీ దర్శకత్వంలో జై లవ కుశ సినిమా చేస్తున్నారు. కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీని జనతా గ్యారేజ్ విడుదలైన రోజు సెప్టెంబర్ 1 న రిలీజ్ చేయడానికి చిత్ర బృందం శ్రమిస్తోంది. ఇక కొరటాల శివ శ్రీమంతుడు తర్వాత మహేష్ బాబు తో భరత్ అను నేను మూవీ రూపొందించడానికి రెడీ అవుతున్నారు.
ఈ నెల నుంచే ఈ ఫిలిం సెట్ మీదకు వెళ్లాలి. కానీ మహేష్ స్పైడర్ మూవీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఆలస్యం అవుతోంది. ఈ సినిమా తర్వాత కొరటాల ఎన్టీఆర్ తో మూవీ తెరకెక్కించనున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు వెల్లడించాయి. ఈ మూవీని ఎన్నారైలు నిర్మించనున్నట్లు తెలిపాయి. జనతా గ్యారేజ్ లో కొంత క్లాస్ టచ్ ఇచ్చిన కొరటాల, ఈ సారి పూర్తిగా మాస్ ని మెప్పించే కథను ఎన్టీఆర్ కోసం సిద్ధం చేసినట్లు సమాచారం. వీరి కలయికలో రానున్న మూవీ రికార్డులను నెలకొల్పడం గ్యారంటీ.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.