Jr NTR, Koratala Siva: డెడికేషన్ తో ఫిదా చెయ్యబోతున్న తారక్!

  • September 16, 2021 / 06:40 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సినిమాసినిమాకు కొత్త లుక్ ట్రై చేస్తూ ఆ లుక్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల నుంచి ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ మొదలు కానుండగా ఈ సినిమాలో తారక్ స్లిమ్ అండ్ స్టైలిష్ లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే బరువు తగ్గిన తారక్ సినిమాలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచటం గ్యారంటీ అనే కామెంట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తారక్ లుక్ విషయంలో మరోసారి తన డెడికేషన్ తో ఫిదా చేయనున్నారని తెలుస్తోంది.

ఆర్ఆర్ఆర్ సినిమాలో లావుగా కనిపిస్తున్న ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాలో స్టూడెంట్ గా కనిపిస్తున్న నేపథ్యంలో లుక్ ఫ్రెష్ గా ఉండాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. జనతా గ్యారేజ్ సినిమాలో తారక్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ తొలి వారంలో ఈ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ ఈ సినిమాలో దాదాపుగా ఫిక్స్ అయినట్టే అని తెలుస్తోంది. అనిరుధ్, రత్నవేలు ఈ సినిమా కొరకు పని చేయనున్నారని సమాచారం.

భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుండగా షూటింగ్ ను వేగంగా పూర్తి చేసి వచ్చే ఏడాది సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. కొరటాల శివ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించనున్న నేపథ్యంలో ఇతర భాషల నటీనటులకు ఈ సినిమాలో ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus