ఎన్టీఆర్ 28వ సినిమాను డైరక్ట్ చేయనున్న త్రివిక్రమ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా ఖరారు అయింది. నందమూరి అభిమానులకు కొత్త సంవత్సర కానుకగా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. జనతా గ్యారేజ్ తర్వాత ఎక్కువ సమయం కథలు  వినడానికే కేటాయించిన తారక్ త్రివిక్రమ్ చెప్పిన కథకు అప్పుడే ఒకే చెప్పారు. అయితే ఆ డైరక్టర్ పవన్ కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ చెయ్యాల్సి ఉంది. దీంతో ఎన్టీఆర్ 27 వ సినిమాని  బాబీ దర్శకత్వంలో చేయడానికి ఒప్పుకున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మూడు షేడ్స్ తో తారక్ కనిపించనున్న ఈ మూవీ సంక్రాంతి తర్వాత సెట్స్ మీదకు వెళ్లనుంది.

ఆ తర్వాత యంగ్ టైగర్ 28 వ ఫిల్మ్ పట్టాలెక్కనుంది. హారిక & హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్న మూవీ సెప్టెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని నిర్మాత రాధాకృష్ణ శనివారం స్పష్టం చేశారు. ఈ చిత్రం 2018 సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus