యంగ్‌ టైగర్‌కు పాన్‌ ఇండియా ఆలోచన వచ్చిందట

టాలీవుడ్‌లో ఇప్పుడు పాన్‌ ఇండియా మూడ్‌ ఉంది. ప్రతి హీరో ఓ పాన్‌ ఇండియా సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. దీనికి ఆధ్యుడు ప్రభాస్‌. ‘బాహుబలి’ లాంటి సినిమాతో దేశవ్యాప్తంగా అందరికీ పరిచయమయ్యాక… ఆ తర్వాత చేసే సినిమాలన్నీ పాన్‌ ఇండియాగానే ఉండాలి అనుకుంటున్నాడు. అందులో భాగంగా వరుసగా అలాంటి సినిమాలే చేస్తూ వస్తున్నాడు. తాజాగా ఎన్టీఆర్‌కి కూడా ఇలాంటి ఆలోచనే వచ్చిందట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత చేయబోయే సినిమా కూడా పాన్‌ ఇండియా మూవీ అవ్వాలని కోరుకుంటున్నాడట.

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ సినిమా మొదలవ్వాల్సి ఉంది. చాలా రోజుల క్రితమే ఈ సినిమాను ప్రకటించారు. హారిక హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ నిర్మించనున్నాయని చెప్పారు. అయితే కరోనా – లాక్‌డౌన్‌ పరిస్థితుల కారణంగా సినిమా ప్రారంభం వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇటీవల సినిమా షూటింగ్‌ ప్రారంభం అనే మాటలు వినిపించాయి. అయితే అనూహ్యంగా ఇప్పుడు సినిమా కథ మారుస్తున్నారంటూ కొత్తగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా కథను పాన్‌ ఇండియా రేంజికి తీసుకెళ్తారని టాక్‌.

ఎన్టీఆర్‌ 30 కోసం ఇప్పటికే త్రివిక్రమ్‌ కథను పూర్తి స్థాయిలో సిద్ధం చేశారట. అయితే ఇప్పుడు పాన్‌ ఇండియాకు తగ్గట్టుగా మార్పులు చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ అదే జరిగితే అందరూ అనుకుంటున్నట్లు సినిమా త్వరలో మొదలవ్వదు. దీనికి ఇంకొన్ని రోజుల సమయం వేచి చూడక తప్పదు. మరోవైపు ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకొని రెడీ అయిపోతాడు. త్రివిక్రమ్‌ ప్రస్తుతం ‘అయ్యప్పనుమ్‌ కొషియమ్‌’ రీమేక్‌ పనుల్లో ఉన్నాడు. ఎన్టీఆర్‌ రెడీ అయ్యేలోపు త్రివిక్రమ్‌ ఈ పని పూర్త చేస్తాడేమో.

Most Recommended Video

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus