యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీపై భారీ అంచనాలు ఉండేవి. పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటాలని వెళ్లిన తారక్ కు ‘వార్ 2’ రూపంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ ఫెయిల్యూర్ తర్వాత ఇప్పుడు ట్రేడ్ లో ఆదిత్య ధర్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ‘ధురంధర్’ సినిమాతో ఆయన టేకింగ్, విజువల్ క్లారిటీ చూసి క్రిటిక్స్ మెచ్చుకుంటున్నారు. ఒకవేళ ఎన్టీఆర్ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఉన్న దర్శకుడిని ఎంచుకుని ఉంటే, ఈరోజు బాలీవుడ్ హిస్టరీ పూర్తిగా వేరేలా ఉండేదన్నది అందరి మాట.
‘వార్ 2’ ఫలితం చూశాక తారక్ జడ్జిమెంట్ ఎక్కడో తేడా కొట్టిందని స్పష్టమవుతోంది. ఆయన కేవలం ప్రాజెక్ట్ క్రేజ్ ను చూసుకున్నారే తప్ప, దర్శకుడి శైలి ఈ భారీ యాక్షన్ కు సెట్ అవుతుందా లేదా అని ఆలోచించలేదు. అయాన్ ముఖర్జీ మంచి దర్శకుడే అయినా, రొమాంటిక్ డ్రామాలు తీసే ఆయన చేతిలో ఇద్దరు మాస్ సూపర్ స్టార్లను పెడితే అవుట్ పుట్ ఇలాగే ఉంటుందని విమర్శలు వచ్చాయి.
అదే ఆదిత్య ధర్ అయితే తారక్ ఇమేజ్ కి తగ్గట్టు, ఒక స్ట్రాంగ్ అండ్ ఇంపాక్ట్ ఫుల్ ఎంట్రీని ఇచ్చేవారు. ‘ధురంధర్’ లాంటి గ్రిప్పింగ్ నరేషన్ తో, విజువల్స్ పక్కాగా ఉంటే ఎన్టీఆర్ తొలి సినిమా రిజల్ట్ మరో స్థాయిలో ఉండేది. కేవలం క్రాఫ్ట్, స్టోరీ టెల్లింగ్ పరంగా చూసినా తారక్ అంచనా తప్పిందని తేలిపోయింది.
వార్ 2 లో కంటెంట్ కంటే ట్రోలింగ్ మెటీరియల్ ఎక్కువైపోయింది. ఇలాంటి సినిమా కోసం ఒక స్టార్ అంత కష్టపడటం వృథా అయింది. రాజకీయ అంశాలను పక్కన పెడితే.. సినిమా మేకింగ్ పరంగా చూసినా, సరైన దర్శకుడు లేకపోవడం వల్లే ఈ ఫెయిల్యూర్ వచ్చిందని క్రిటిక్స్ అంటున్నారు. మొత్తానికి ఇది ఎన్టీఆర్ కు ఒక పెద్ద పాఠం. కేవలం పెద్ద బ్యానర్ మోజులో పడకుండా, దర్శకుడి సత్తా, విజన్ చూసుకుని తారక్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చేదు అనుభవం నుంచి బయటపడాలంటే.. నెక్స్ట్ స్టెప్ చాలా పక్కాగా, ప్లానింగ్ తో ఉండాలి.