ఆలస్యంగా షూటింగ్ లో పాల్గొననున్న ఎన్టీఆర్
- February 21, 2017 / 01:35 PM ISTByFilmy Focus
సినిమాలో ఎక్కువగా హీరోమీదే సీన్లు ఉంటాయి. అందుకే ముందుగా అతనిపై సన్నివేశాలు తెరకెక్కిస్తారు. బట్ ఫర్ ఏ చేంజ్.. ఇతర ఆర్టిస్టులతో బాబీ ముందుగా చిత్రీకరణ సాగిస్తున్నారు. ఎన్టీఆర్ 27 మూవీ షూటింగ్ ని ఎన్టీఆర్ లేకుండా ప్రారంభించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ మూడు షేడ్స్ లో నట విశ్వరూపం ప్రదర్శించనున్నారు. అందుకే మెకోవర్ పై దృష్టి సారించారు. మూడు పాత్రలకు తగిన రూపు వచ్చేలా కసరత్తులు ప్రారంభించారు. అయితే ఎప్పుడు ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అవుతారు? అని అభిమానులు ఆసక్తిగా ప్రశ్నించారు.
అందుకు సమాధానం కోసం డైరక్టర్ ని సంప్రదిస్తే.. ఎన్టీఆర్ మార్చి 10 నుంచి పాల్గొంటారని స్పష్టం చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్నారు. దేవీ గతంలో నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ సినిమాలకు సంగీతం అందించారు. అవి సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ 27 కి అద్భుత ఆల్బమ్ ఇవ్వనున్నారు. జై లవకుశ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















