కొత్త సినిమాకు హిట్ సెంటిమెంట్ తో ప్రారంభించిన ఎన్టీఆర్

  • February 10, 2017 / 01:33 PM IST

జనతా గ్యారేజ్ విడుదలైన ఐదు నెలల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొత్త సినిమాకి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో నందమూరి కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. బాబీ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ ముహూర్తపు షాట్ కి తారక్ తన హిట్ సెంటిమెంట్ ని ఫాలో అయ్యారు. ముహూర్తపు షాట్ కి ఎన్టీఆర్ హెయిర్ బ్యాండ్ తో వస్తే ఆ చిత్రం సూపర్ హిట్ అవుతుంది. గతంలో అపజయాలు పలకరిస్తున్న సమయంలో తారక్ హెయిర్ బ్యాండ్ పెట్టుకొని యమదొంగ సినిమా ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఆ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

జనతా గ్యారేజ్ చిత్రం ముహూర్తపు షాట్ కి కూడా హెయిర్ బ్యాండ్ తో వచ్చారు. ఇది కూడా తన కెరీర్ లో అత్యుత్తమ చిత్రంగా నిలిచింది. ఇప్పుడు తన 27 వ సినిమా ప్రారంభోత్సానికి హెయిర్ బ్యాండ్ తో వచ్చి ఈ మూవీ సూపర్ హిట్ కావాలని, అవుతుందని చెప్పకనే చెప్పారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీకి బాలీవుడ్, హాలీవుడ్ నిపుణులు పనిచేస్తున్నారు. ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus