బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో తారక్ మూడు పాత్రల్లో నటించనున్నారు. క్యారెక్టర్స్ బట్టి ఈ సినిమాకి “జై లవ కుశ” అనే టైటిల్ పరిశీలిస్తున్నారని ప్రచారంలో ఉన్నింది. చిత్ర బృందం దీనిపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఈ పేరుని ఒక ఫోటో ఖరారు చేసింది. అదెలా అంటే.. రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్ లొకేషన్ కి ఈరోజు హరికృష్ణ వెళ్లారు. అక్కడ తనయుడు ఎన్టీఆర్ తో సినిమా గురించి మాట్లాడారు. ఆ సమయంలో చిత్ర బృందం ఓ ఫోటో ని క్లిక్ మనిపించింది. ఆ ఫోటోని ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ హరికృష్ణ సెట్స్ కి వచ్చిన విషయాన్నీ షేర్ చేసుకుంది.
అయితే ఇందులో ఎన్టీఆర్ పేస్ కనిపించడం లేదు. కానీ అతని పేరు మాత్రం ఎన్.లవ కుమార్ అనే బోర్డు స్పష్టంగా కనిపిస్తోంది. ఆ నేమ్ బోర్డు ప్రకారం. ఇందులో ఎన్టీఆర్ పోషించే పాత్రల్లో ఒకరి పేరు లవ అని తెలిసింది. ఇక ఇద్దరి పేర్లు జై, కుశ అని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇలా సినిమా పేరు ఒక ఫోటో ద్వారా ఖరారు అయింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.