NTR32: తారక్32 ను డైరెక్ట్ చేసే లక్కీ డైరెక్టర్ ఎవరో?

  • February 1, 2023 / 08:47 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్30 కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతుండగా ఎన్టీఆర్31 ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కనుంది. ఈ రెండు సినిమాల తర్వాత తారక్ నటించబోయే సినిమాకు డైరెక్టర్ ఎవరనే ప్రశ్నకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కు బుచ్చిబాబు ఇప్పటికే కథ చెప్పి ఒప్పించడం జరిగింది. ప్రస్తుతం చరణ్ తో సినిమా చేస్తున్న బుచ్చిబాబు తారక్ తో కూడా సినిమా చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ప్రకటించి ఆగిపోయిన సంగతి తెలిసిందే.

అయితే తారక్ త్రివిక్రమ్ మధ్య మనస్పర్ధలు తొలగిపోయాయని ఈ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది. తారక్ సోలో హీరోగా జక్కన్న డైరెక్షన్ లో ఒక ప్రాజెక్ట్ తెరకెక్కనుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్32 ఈ కాంబోలో తెరకెక్కినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ అట్లీ కాంబినేషన్ గురించి కూడా జోరుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అట్లీ ఇప్పటికే తారక్ కు కథ చెప్పినట్టు ప్రచారం జరిగింది.

తారక్ సంజయ్ లీలా భన్సాలీ కాంబో మూవీకి సంబంధించి కూడా ఎన్నో వార్తలు వినిపించాయి. సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్ లో నటించడానికి తారక్ కూడా ఆసక్తి చూపించారని బోగట్టా. ఈ కాంబోలో మూవీ సాధ్యమో కాదో చూడాల్సి ఉంది. తారక్ తో సినిమా చేయాలని టాలీవుడ్ యంగ్ జనరేషన్ స్టార్ డైరెక్టర్లు ఎదురుచూస్తున్నారు.

తారక్ రిషబ్ శెట్టి కాంబోలో ఒక సినిమా తెరకెక్కితే బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ కాంబినేషన్లలో ఏ కాంబినేషన్ కు తారక్ ఓకే చెబుతారో చూడాలి. తారక్ పుట్టినరోజున తారక్ కొత్త సినిమాలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ అయితే ఉంది.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus