బాలయ్య కృష్ణను కలిసింది అందుకేనా..?  

నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘ఎన్టీఆర్ బయోపిక్’ ప్రతిష్టాత్మకంగా రూపొందుతుంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ చిత్రం మొదటి ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ గానూ రెండవ పార్ట్ ‘ఎన్టీఆర్- మనాయకుడు’ గా వస్తున్నాయి. ఇప్పటికీ మొదటి పార్ట్ అయిన ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.  ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ చిత్రం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకుని ముగుంపు దశలో ఉన్నట్టు సమాచారం. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా రెండు పోర్టులకి సంబంధించిన ఆడియో వేడుకను డిసెంబర్ 21న (ఈరోజు) సాయంత్రం 5 గంటలకు నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ ఆడియో వేడుక ను  ఫిల్మ్ నగర్లోని ‘జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్’ లో నిర్వహించనున్నారు చిత్ర యూనిట్ . ఇప్పటికే కీరవాణి సంగీతమందించిన రెండు పాటలను విడుదల చేయగా వాటికి మంచి స్పందన లభించింది. ఇక ఈ చిత్రంలో ‘ఎన్టీఆర్’ పాత్రను బాలకృష్ణ  పోషిస్తుండగా.. బసవతారకం పాత్రలో విద్యాబాలన్, మహానటి సావిత్రి పాత్రలో   నిత్యామీనన్, అతిలోక సుందరి శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్ సింగ్, జయప్రద పాత్రలో తమన్నా, ఆంధ్ర ప్రదేశ్ సీ.ఎం మరియు ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయిడు పాత్రలో రానా, అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus