ఎన్టీఆర్ జైలవకుశ షూటింగ్ ఆగిపోయిందా?

ఎన్టీఆర్ సినిమా కోసం ఒక పక్క ఫ్యాన్స్ కొన్ని కోట్ల కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. సినిమా ఎప్పుడెప్పుడా అని వేట్ చేస్తూ ఉన్న తరుణంలో సడన్ గా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. దానికి కారణం కొన్ని గొడవలు జరగడమే. అసలు షూటింగ్ లో గొడవలు జరగడం ఏంటి? ఈ సినిమాకి ఎన్టీఆర్ అన్న కల్యాణ్ రామ్ నిర్మాత, ఇక దర్శకుడు బాబీ కాస్త కొత్త నిర్మాత అంటే హీరోని ఫాలో అయిపోతూ సినిమాను తీసే దర్శకుడు మరి ఇలా అంత బాగానే ఉన్న సమయంలో ఈ గొడవ ఏంటి అంటే ఒకసారి ఈ కధ చదవండి. యంగ్ టైగర్ నటిస్తున్న ‘జై ల కుశ’ సెట్స్ లో గొడవ జరగడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది.  బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రలలో నటిస్తుండగా, ఈ సినిమాకు ఫోటోగ్రఫీ అందించే బాధ్యతలను ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ సి.కే.మురళీధరన్ నిర్వహిస్తూ ఉన్నాడు.

అయితే అసలు గొడవ ఇక్కడే స్టార్ట్ అయ్యింది “పీకే, ‘3 ఇడియట్స్’, ‘మొహింజోదారో’, ‘లగే రహో మున్నాభాయ్’ వంటి సినిమాలకు ఫోటోగ్రఫీ విధులను నిర్వహించిన మురళీధరన్ కు ‘జై లవకుశ’ టీం సభ్యులకు మధ్య తలెత్తిన అభిప్రాయ బేధాలకు దర్శకుడు బాబీ కారణం అన్న వార్తలు వస్తున్నాయి. ఈసినిమాకు సంబంధించి అన్నీ తాను చెప్పినట్లుగానే జరగాలి అని బాబీ చెపుతున్న మాటలు తట్టుకోలేక  అర్ధాంతరంగా మురళీధరన్ వెళ్లిపోయడని తెలుస్తోంది. అయితే గొడవల వల్ల నష్టం వాటిల్లుతుంది అని గమనించిన నిర్మాత కల్యాణ్ రామ్ వెంటనే మురళీధరన్ స్థానంలో చోటా కే నాయుడును తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఇవన్నీ రూమర్స్ అనీ జూన్ నుండి మురళీధరన్ వేరే బాలీవుడ్ సినిమాకు పనిచేయవలసిన పరిస్థుతులు ఏర్పడంతో ఈమార్పు జరిగింది అని మరో న్యూస్ వినిపిస్తుంది. ఏది ఏమైనా, ఇప్పుడు ఈ టాపిక్ హాట్ హాట్ గా మారడంతో టాలీవుడ్ అంతా ఇదే మ్యాటర్ పై మాట్లాడుకుంటూ ఉండడం గమనార్హం.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus