మొత్తానికి ఎన్టీఆర్ తదుపరి చిత్రాన్ని కన్ఫర్మ్ చేశారు

  • June 4, 2019 / 07:23 PM IST

ప్రస్తుతం రాజమౌళితో “ఆర్ ఆర్ ఆర్” సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత సినిమా ఎవరితోననే విషయంలో నిన్నటివరకూ క్లారిటీ లేదు. మధ్యలో “కె.జి.ఎఫ్” దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా ఉండబోతోందని వార్తలొచ్చినప్పటికీ క్లారిటీ లేకపోవడంతో ఆ విషయాన్ని లైట్ తీసుకొన్నారు జనాలు. కానీ.. ఇవాళ దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజును పురస్కరించుకొని తెలుగులో ప్రఖ్యాత నిర్మాణ సంస్థ అయిన మైత్రీ మూవీ మేకర్స్ “హ్యాపీ బర్త్ డే” యాడ్ ను వేయించింది.

ఒక కన్నడ సినిమా దర్శకుడికి తెలుగు నిర్మాణ సంస్థ బర్త్ డే విషెస్ పోస్టర్ ను యాడ్ గా వేయించడం అంటే ఆ బ్యానర్ లో సినిమా కన్ఫర్మ్ అనే చెప్పాలి. సో, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో సినిమా ఉండబోతోంది అనేది కన్ఫర్మ్ అయ్యింది. అయితే.. మైత్రీ దగ్గర ప్రెజంట్ డేట్స్ ఉన్న హీరో ఎన్టీఆర్ మాత్రమే. దాన్ని బట్టి ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ క్రేజీ కాంబినేషన్ కన్ఫర్మ్ అయ్యిందనే అనుకోవాలన్నమాట.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus