Allu Arjun: తొలి బాలీవుడ్‌ సినిమా కోసం టాలీవుడ్‌ దర్శకుడినే నమ్ముకున్న అల్లు అర్జున్

అల్లు అర్జున్‌ బాలీవుడ్‌ సినిమా ఎప్పుడు? చాలా రోజులుగ వినిపిస్తున్న ఈ ప్రశ్నకు సగం సమాధానం వచ్చేసింది. అదేంటి సగం.. పూర్తి అనౌన్స్‌మెంట్ ఇచ్చేసినట్లున్నారు కదా అంటారా? అవును ఇచ్చారు కానీ సగమే ఇచ్చారు అని అంటున్నారు ఫ్యాన్స్‌. కారణం సినిమా అయితే ప్రకటించారు కానీ.. ఎప్పుడు మొదలు, ఎప్పుడు తుది లాంటి విషయాలేవీ చెప్పలేదు. దీంతో ఇది సగం అనౌన్స్‌మెంటే అని అంటున్నారు. ఇక అసలు విషయంలోకి వస్తే.. అల్లు అర్జున్‌ – సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌ అయ్యింది.

‘పుష్ప 2’ తర్వాత అల్లు అర్జున్‌ చేయబోయే సినిమా ఏంటి? అంటూ చాలా రోజులుగా ప్రశ్నలు వస్తున్నాయి. దీని కోసం చాలా నిర్మాణ సంస్థల పేర్లు, దర్శకుల పేర్లు వినిపించాయి. కానీ ఏదీ ఓకే కాలేదు. ఇప్పుడు బాలీవుడ్‌ సినిమా అనౌన్స్‌ అయ్యింది. అంటే పాన్‌ ఇండియా సినిమానే అనుకోండి. టీ సిరీస్‌ నిర్మాణంలో సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో ఈ సినిమా రూపొందబోతోంది. ఈ సినిమా భారీ బడ్జెట్‌తో రూపొందుతుంది అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అక్కడ నిర్మాత టీ సిరీస్‌ కాబట్టి.

ప్రభాస్‌తో ‘స్పిరిట్‌’ సినిమా చేస్తున్న నిర్మాతతోనే సందీప్‌ రెడ్డి వంగా అల్లు అర్జున్‌ సినిమాను పక్కా చేసేశారు. ఇటీవల కలుసుకుని మాట్లాడుకున్నామని, అంతా ఓకే అనుకుని సినిమా అనౌన్స్‌ చేస్తున్నామని ప్రకటించేశారు. ఈ ఏడాది ఆఖరులో ‘స్పిరిట్‌’ సినిమా మొదలవ్వొచ్చు. అక్కడికి ఏడాది అంటే 2024 ఆఖరులో ఈ సినిమా పూర్తయి.. విడుదలకు సిద్ధం కావొచ్చు. ఆ తర్వాతే అల్లు అర్జున్‌ సినిమా చేస్తారు సందీప్‌ రెడ్డి. అంటే 2025లో ఈ సినిమా మొదలవుతుంది అని చెప్పొచ్చు. ఇక రిలీజ్‌ సంగతి కూడా ఆ ఏడాదే అని చెబుతున్నారు.

అందుకే ఈ సినిమాకు సంబంధించి డేట్‌, సీరియల్‌ నెంబర్‌ లాంటివి ఏవీ లేకుండా అనౌన్స్‌ చేసేశారు. వరుసగా స్టార్‌ హీరోలు అనౌన్స్‌ చేస్తున్నారు కదా.. తాను కూడా రేసులో ఉండేలా బన్నీ ఈ సినిమాకు పూర్తి వివరాలు లేకుండా అనౌన్స్‌ చేశాడు అనే కామెంట్స్‌ కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం వచ్చే నెల బన్నీ పుట్టిన రోజు కదా అప్పుడు ఏమైనా క్లారిటీ వస్తుందేమో.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus