NBK108: బాలయ్య అనిల్ సినిమాకి ముహూర్తం ఫిక్స్ ప్రారంభమయ్యేది అప్పుడే!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఇలా గోపీచంద్ మలినేను దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్ నిర్మాణంలో రాబోతున్న వీరసింహారెడ్డి సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా అనంతరం బాలకృష్ణ తన తదుపరి చిత్రాన్ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈ సినిమా NBK 108 టైటిల్ తో షూటింగ్ పనులను ప్రారంభం జరుపుకొనుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ పనులకు చిత్ర బృందం ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. ఈ సినిమా డిసెంబర్ 8వ తేదీ గురువారం ఉదయం 9:36నిమిషాలకు షూటింగ్ ప్రారంభం కానున్నట్లు చిత్ర బృందం అధికారక పోస్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇక ఈ సినిమా 12 రోజుల పాటు హైదరాబాదులో రెగ్యులర్ షూటింగ్ పనులను ప్రారంభించుకొనుందని సమాచారం.

ఎప్పుడు కామెడీ జోనర్ లో సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం సరికొత్త జానర్ లో సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది.బాలకృష్ణ కోసం అనిల్ రావిపూడి ఎంతో విభిన్న కథాంశంతో స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నారని సమాచారం.ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత ఎలాంటి అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిప్పుడికి పేరు ఉన్న సంగతి తెలిసిందే. మరి బాలయ్యతో అనిల్ రావిపూడి ఎలాంటి హిట్ అందుకుంటారని నందమూరి అభిమానులలో ఆత్రుత నెలకొంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus