OG: ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత ‘ఓజి’నే.. ఏ రకంగా అంటే?

రాజమౌళితో ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి ప్రైడ్ ఆఫ్ నేషన్ సినిమా తీసి భారీ లాభాలు అందుకున్న నిర్మాత డీవీవీ దానయ్య, ఇప్పుడు పవన్ కళ్యాణ్ ‘OG’తో అంతకుమించిన జాక్‌పాట్ కొట్టారు అనే చెప్పాలి. పవన్ రాజకీయ కమిట్‌మెంట్లతో సినిమా ఆలస్యమైనా, అనౌన్స్ చేసిన రోజు నుంచి ఇప్పటికీ ‘OG’పై ఉన్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. దర్శకుడు సుజీత్.. పవన్‌ను ప్రెజెంట్ చేసిన స్టైలిష్ విధానం సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది.

OG

ఈ సినిమాతో దానయ్య ఒక రీజనల్ సినిమాకు ఊహించని స్థాయిలో లాభాలు చూడబోతున్నారని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. నాన్-థియేట్రికల్ రైట్స్‌ను ఎప్పుడో భారీ ధరకు అమ్మేసిన ఆయన, థియేట్రికల్ హక్కులను కూడా రికార్డు రేట్లకు విక్రయించారు.

ఈ డీల్స్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్స్ కంటే చాలా పెద్ద మొత్తంలో జరగడం విశేషం. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది.

ఇప్పటికే యూఎస్‌ఏలో ప్రీ-రిలీజ్ సేల్స్‌తో ‘OG’ పాత రికార్డులన్నింటినీ బద్దలుకొడుతోంది. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో దానయ్య సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. మొత్తానికి, ‘ఆర్.ఆర్.ఆర్’ తర్వాత నిర్మాత దానయ్యకు ‘OG’ మరో భారీ జాక్‌పాట్‌గా నిలిచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలని పవన్ కళ్యాణ్ అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మైకేల్ జాక్సన్ బయోపిక్‌ ను సీరియస్ గా తీసుకున్న సందీప్ రెడ్డి వంగా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus