OG Collections: అరెరే.. ‘ఓజి’ మరో మంచి ఛాన్స్ మిస్ చేసుకుందే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , దర్శకుడు సుజిత్ కలయికలో రూపొందిన ఔట్ అండ్ ఔట్ యాక్షన్ మూవీ (OG) సెప్టెంబర్ 25న ప్రేక్షకుల విడుదలైన ఈ సినిమా ప్రీమియర్స్ తోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ కల్ట్ ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ ఇచ్చింది ఈ సినిమా. టాక్ అదిరిపోయింది. దీంతో మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ ను సాధించింది. కానీ తర్వాత ఈ సినిమా కలెక్షన్స్ డౌన్ అవుతూ వచ్చాయి.

OG Collections

దసరా హాలిడేస్ వల్ల.. గట్టిగా క్యాష్ చేసుకునే అవకాశం వచ్చింది. అయితే టికెట్ రేట్లు ఎక్కువగా ఉండటం, అలాగే ‘కాంతార చాప్టర్ 1’ సినిమా కూడా పోటీగా ఉండటం వల్ల.. అది సాధ్యపడలేదు. ఇక 3వ వీకెండ్ ను కూడా ‘ఓజి’ క్యాష్ చేసుకోలేకపోయింది. బ్రేక్ ఈవెన్ అయితే కష్టంగానే కనిపిస్తుంది.

ఒకసారి 17 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 44.16 cr
సీడెడ్ 19.08 cr
ఉత్తరాంధ్ర 13.81 cr
ఈస్ట్ 11.15 cr
వెస్ట్ 8.30 cr
గుంటూరు 9.62 cr
కృష్ణా 8.81 cr
నెల్లూరు 4.21 cr
ఏపీ+తెలంగాణ టోటల్ 119.14 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 15.14 cr
ఓవర్సీస్ 32.30 cr
టోటల్ వరల్డ్ వైడ్ 166.58 (షేర్)

‘ఓజి’ (OG) చిత్రానికి రూ.173 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.174 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 18 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.166.58 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.283.72 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.42 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయాల్సి ఉంది. చూస్తుంటే.. అది ఇక కష్టంగానే కనిపిస్తుంది. కొత్త సినిమాలు వస్తున్నాయి కాబట్టి.. ‘ఓజి’ని జనాలు ఎంతవరకు పట్టించుకుంటారు అనేది అనుమానమే.

 మొదటి భర్తతో విడాకులు.. బిగ్ బాస్ కి రావడానికి కారణం అదే: దివ్వెల మాధురి

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus