ఇటీవల విడుదలైన ‘ఓజి’ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చింది. దాదాపు 13 ఏళ్ళ తర్వాత పవన్ కళ్యాణ్ కి ‘ఓజి’ రూపంలో ఓ డీసెంట్ హిట్ పడినట్టు అయ్యింది. కమర్షియల్ లెక్కల సంగతి తర్వాత. ఫ్యాన్స్ అయితే ‘ఓజి’ తో సంతృప్తి చెందారు. పవన్ కళ్యాణ్ కూడా ‘ఓజి’ రిజల్ట్ తో హ్యాపీ. అయితే ‘ఓజి’ మేనియా వల్ల.. ప్రభాస్ సినిమా టైటిల్ మారే పరిస్థితి వచ్చిందా? అంటే అవుననే సమాధానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళితే.. ‘మైత్రి మూవీ మేకర్స్’ బ్యానర్లో ప్రభాస్ హీరోగా ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతుంది. హను రాఘవపూడి దీనికి దర్శకుడు. కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఈ నెలలో అంటే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు ఉంది కాబట్టి.. టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదలాలని చిత్ర బృందం భావిస్తోంది. ఈ ప్రాజెక్టుకి ‘ఫౌజి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు మొదటి నుండి టాక్ నడుస్తుంది.
కానీ నిన్న ‘డ్యూడ్’ సినిమా ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన దర్శకుడు హను రాఘవపూడి.. ‘టైటిల్ అదే ఉంటుందా లేదా అనేది ఈ నెలలోనే కన్ఫర్మ్ అవుతుంది’ అంటూ చెప్పుకురావడం అందరికీ షాకిచ్చింది. ‘ఫౌజి’ అనే టైటిల్ దాదాపు ఖరారు అయిపోయినట్టే అనుకుంటున్న టైంలో హను ఇలా చెప్పడం.. బాంబ్ పేల్చినట్టు అయ్యింది.
‘ఫౌజి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేయాలని మేకర్స్ అనుకుంటున్న మాట నిజమే. కానీ పవన్ కళ్యాణ్ ‘ఓజి’ సినిమా ఇటీవల రిలీజ్ అవ్వడంతో.. దాని సౌండింగ్ ఎక్కువగా ఉన్నట్టు మళ్ళీ డౌట్ పడుతున్నారట. దీంతో టైటిల్ మార్చాలనే ఆలోచన వారికి ఉన్నప్పటికీ.. ఇంత షార్ట్ టైంలో మరో మంచి టైటిల్ ఎక్కడ దొరుకుతుంది అనే గందరగోళంలో కూడా వారు ఉన్నట్టు టాక్. చూడాలి మరి ఫైనల్ గా ఏ టైటిల్ తో అనౌన్స్ చేస్తారో.