Chiranjeevi: వెంకటేష్ ని మ్యాచ్ చేయలేకపోయిన చిరంజీవి

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ ఏడాది సంక్రాంతికి విడుదలై రీజనల్ సినిమాల్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుంది అని మేకర్స్ కూడా ఊహించలేదు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులు కొనుగోలు చేసిన బయ్యర్స్ అంతా 5 రెట్లు లాభపడ్డారు. ఆ సినిమాకు ఇంత హైప్ పెరగడానికి కారణం ‘గోదారి గట్టు మీద రామ సిలకవే’ అంటూ రమణ గోగుల పాడిన పాటే అని చెప్పాలి.

Chiranjeevi

వెంకటేష్ కి ఉన్న ఫ్యామిలీ ఇమేజ్ కి ఈ పాట కరెక్ట్ గా సెట్ అయ్యింది. ఈ పాటలో వెంకటేష్..హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ కలిసి వేసిన స్టెప్పులు చాలా సింపుల్ గా అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉన్నాయి. వెంకటేష్ డాన్సర్ కాదు. అయినా అతని బాడీ లాంగ్వేజ్ కి ఆ పాట బాగా సెట్ అయ్యింది. అందువల్ల ఆడియన్స్ బాగా ఓన్ చేసుకున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సక్సెస్ లో అతి కీలకమైన పాత్ర పోషించింది ‘గోదారి గట్టు’ పాట.

ఈ విషయాన్ని గమనించిన చిరంజీవి.. తనకు కూడా అలాంటి స్టైల్లో పాట కావాలని కోరి మరీ ‘మీసాల పిల్లా’ పాటని డిజైన్ చేయించుకున్నారు. ఇటీవల ఈ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. కానీ ఈ పాట ‘గోదారి గట్టు’ రేంజ్ మ్యాజిక్ ని క్రియేట్ చేయలేకపోయింది. ఈ పాటలో చిరు వేసిన స్టెప్స్, లిరిక్స్ బాగున్నాయి. కానీ ఎక్స్ప్రెషన్స్ మాత్రం ఫోర్స్డ్ గా అనిపించాయి. వెంకటేష్ కి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది కాబట్టి.. కన్విన్సింగ్ గా అనిపిస్తాయి.

కానీ చిరు విషయంలో అలా కాదు కదా. అందుకే ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ ఫస్ట్ లిరికల్ సాంగ్ విషయంలో కొంత మిక్స్డ్ రెస్పాన్స్ వినిపిస్తుంది. వాస్తవానికి దీనికంటే మంచి సాంగ్స్ ఈ సినిమాలో ఉన్నాయట. కానీ దర్శకుడు అనిల్ రావిపూడి, చిరంజీవి..ల మెయిన్ టార్గెట్ ఫ్యామిలీ ఆడియన్స్ కాబట్టి ఈ పాటని వదిలారు. అది మేటర్.

మిత్ర మండలి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus