OG Vs Akhanda2: బాలయ్య అభిమానులకు షాక్ ఇవ్వబోతున్న పవన్ కళ్యాణ్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పూర్తి చేయాల్సిన 3 సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్నాయి.అవే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) ‘ఓజి’ (OG) ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) . ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. కొంత ప్యాచ్ వర్క్ పెండింగ్లో ఉంది. అందుకే మార్చి 28న ప్రకటించిన ఈ సినిమా మే 09 కి వాయిదా పడింది. అయినా పర్వాలేదు. సమ్మర్ కి పెద్ద సినిమా లేదు అనే లోటు ఈ సినిమాతో తీరే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి.

OG Vs Akhanda2:

ఇక దీని కంటే ముందే ‘ఓజి’ సినిమాకి సంబంధించి తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేశాడు పవన్ కళ్యాణ్. అయితే దానికి సంబంధించి కూడా 4,5 క్లోజప్ షాట్స్ కావాలి. సో 2 రోజులు కాల్షీట్లు ఇస్తే.. ‘ఓజి’ పని పూర్తయిపోతుంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు ఇండస్ట్రీ జనాలు కూడా ఎక్కువ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఇది. ఇదిలా ఉండగా.. ఈ సినిమా సెప్టెంబర్ నెలాఖరులో రిలీజ్ చేయాలని నిర్మాత డీవీవీ దానయ్య (D. V. V. Danayya) భావిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్.

‘ఓజి’ పాన్ ఇండియా సినిమా. అలాంటి సినిమాలకి సెప్టెంబర్ ఎండింగ్ మంచి టైం. అయితే ఆల్రెడీ సెప్టెంబర్ 25కి సాయి దుర్గ తేజ్ ‘SYG'(సంబరాల యేటి గట్టు) (Sambarala Yeti Gattu) రిలీజ్ కాబోతోంది. అలాగే బాలకృష్ణ ‘అఖండ 2’ రిలీజ్ కూడా సెప్టెంబర్ 25 కే ప్రకటించారు. సాయి దుర్గ తేజ్ (Sai Dharam Tej)  మావయ్య సినిమా వస్తుంది అంటే కచ్చితంగా వాయిదా వేసుకోవడానికి టీం రెడీగా ఉంటుంది.

కానీ ‘అఖండ 2’ తో అలా కాదా. బోయపాటి శ్రీను (Boyapati Srinu) – బాలయ్య (Nandamuri Balakrishna) కాంబినేషన్ అంటే ట్రేడ్లో మంచి అంచనాలు ఉంటాయి. ‘అఖండ 2’ కూడా పాన్ ఇండియా సినిమా.. దాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. దీన్ని వాయిదా వేయడానికి నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. ఒకవేళ 2 సినిమాలు వస్తే బాక్సాఫీస్ వద్ద బిగ్ ఫైట్ తప్పదు అనే చెప్పాలి.

ఇంటర్నేషనల్‌ లెవల్‌లో చాలా అవార్డులు వచ్చాయ్‌.. ఇక్క రిలీజే కాదు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus