Oh Bhama Ayyo Rama Review in Telugu: ఓ భామ అయ్యో రామా సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సుహాస్ (Hero)
  • మాళవిక మనోజ్ (Heroine)
  • రవీంద్ర విజయ్, బబ్లూ పృథ్వీరాజ్, ప్రభాస్ శ్రీను, రఘు కారుమంచి, మొయిన్ తదితరులు.. (Cast)
  • రామ్ గోదాల (Director)
  • హరీష్ నల్ల (Producer)
  • రధన్ (Music)
  • ఎస్.మణికందన్ (Cinematography)
  • భవిన్ ఎం.షా (Editor)
  • Release Date : జూలై 11, 2025
  • వి ఆర్ట్స్ (Banner)

సుహాస్, మాళవిక మనోజ్ జంటగా తెరకెక్కిన చిత్రం “ఓ భామ అయ్యో రామ”. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ఓ మోస్తరుగా ఆకట్టుకోగా.. “నువ్వు నేను” ఫేమ్ అనిత ఈ చిత్రంతో తెలుగులో రీఎంట్రీ ఇవ్వడం విశేషం. రామ్ గోదాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!

Oh Bhama Ayyo Rama Review in Telugu

కథ: చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన రామ్ (సుహాస్)కి ఎందుకో సినిమాలంటే కోపం. థియేటర్ బయట కూర్చుని సౌండ్ వింటాడు కానీ.. థియేటర్ లోపలికి మాత్రం వెళ్లడు. అయితే.. అనుకోని విధంగా ఓ యాక్సిడెంట్ తో పరిచయమైన సత్యభామ (మాళవిక మనోజ్) కారణంగా సినిమావైపు అడుగులు వేయాల్సి వస్తుంది రామ్.

అసలు సత్యభామ ఎవరు? ఎందుకని రామ్ కి ఇష్టం లేని సినిమా దిశగా అతడ్ని ప్రోత్సహించింది? అసలు రామ్ కి సినిమాలంటే ఎందుకు కోపం? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఓ భామ అయ్యో రామ” చిత్రం.

నటీనటుల పనితీరు: ఎంత యంగ్ మదర్ గా చూపించినా.. అనిత ఎందుకో చాలా అసహజంగా కనిపించింది. “జో” సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న మాళవిక మనోజ్ తన మునుపటి సినిమాలకు భిన్నంగా చాలా యాక్టివ్ గా కనిపించి, కామెడీ పండించే బాధ్యతను తన చిట్టి భుజాలపై వేసుకుని కొంతమేరకు అలరించింది. సుహాస్ ఎప్పట్లానే ఎమోషనల్ & కామెడీ సీన్స్ లో ఆకట్టుకున్నాడు. అయితే.. అతడి పాత్రలో సరైన క్లారిటీ లేకపోవడం వల్ల క్యారెక్టర్ తో జర్నీ చేయలేం.

రవీంద్ర విజయ్ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడు. మొయిన్ కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు.

సాంకేతికవర్గం పనితీరు: రధన్ పాటలు, నేపథ్య సంగీతం వినసొంపుగా ఉన్నాయి. ఉన్న కొద్దిపాటి ఎమోషనల్ సీన్స్ ను వీలైనంతవరకు ఎలివేట్ చేశాడు. మణికందన్ సినిమాటోగ్రఫీ వర్క్ బాగుంది. ముఖ్యంగా యాక్సిడెంట్ సీన్ & సినిమాలో సినిమా సీక్వెన్సులను కాస్త కొత్తగా చూపించాడు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్ప్ గా ఉండొచ్చు. కొన్ని ఎమోషన్స్ ను అనవసరంగా సాగదీసిన భావన కలిగింది.

దర్శకుడు రామ్ ఎంచుకున్న కథలోనే భారీ డ్రామా ఉంది. కానీ అది తెరపై పండలేదు. హీరోయిన్ పాత్రతో కథను నడిపించడం, హీరోయిన్ పాయింటాఫ్ వ్యూ లో హీరో బాధను రివీల్ చేయడం వంటి పాయింట్స్ బాగున్నప్పటికీ.. వాటి ఎగ్జిక్యూషన్ విషయంలో మాత్రం తడబడ్డాడు. అందువల్ల సన్నివేశంలో లేదా సందర్భంలో మేటర్ ఉన్నప్పటికీ.. అవి ఆడియన్స్ ను అలరించలేకపోయాయి.

విశ్లేషణ: కొన్ని సినిమాలకు డ్రామా అవసరం, అది పాత్రల ప్రయాణాన్ని, వాటి బాధను/ఆనందాన్ని ప్రేక్షకులు అనుభూతి చెందేలా చేస్తుంది. “ఓ భామ అయ్యో రామ” విషయంలో కూడా రామ్ ఆ ఫార్మాట్ ను ఫాలో అవుదామనుకున్నాడు. కానీ.. ఆ డ్రామా వర్కవుట్ అవ్వాలంటే.. కాన్ ఫ్లిక్ట్ పాయింట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అనే విషయాన్ని పక్కన పెట్టేశాడు. అందువల్ల ఎంత హెవీ ఎమోషన్ ఉన్నప్పటికీ, సినిమాగా మాత్రం “ఓ భామ అయ్యో రామ” పూర్తిస్థాయిలో ఆకట్టుకోలేకపోయిందనే చెప్పాలి.

ఫోకస్ పాయింట్: అయ్యో అయ్యో అయ్యయ్యో!

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus