Okkadu: పవన్ ఫ్యాన్స్ రికార్డ్ సులువుగానే బ్రేక్ అవుతుందా?

  • January 4, 2023 / 12:46 AM IST

పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లోని స్పెషల్ సినిమాలలో ఖుషి మూవీ ఒకటి. ఈ సినిమా వల్ల ఎంతోమంది పవన్ కళ్యాణ్ కు వీరాభిమానులుగా మారిపోయారు. ఖుషి సినిమా రీరిలీజ్ కలెక్షన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అంచనాలకు మించి కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు రాబోయే రోజుల్లో రీరిలీజ్ అవుతున్న సినిమాలకు భారీ టార్గెట్ ను సెట్ చేసింది. ఇప్పట్లో ఈ టార్గెట్ బ్రేక్ కావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మూడున్నర కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లతో ఖుషి సెట్ చేసిన టార్గెట్ ను ఒక్కడు మూవీ బ్రేక్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సంక్రాంతి పండుగ కానుకగా ఈ నెల 7వ తేదీన థియేటర్లలో ఒక్కడు రీరిలీజ్ కానుండగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే 3.5 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను మించి ఒక్కడు మూవీ కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో లేదో చూడాల్సి ఉంది.

ఖుషి మూవీలో భూమిక హీరోయిన్ కాగా ఒక్కడు మూవీలో కూడా భూమిక హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. గుణశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఒక్కడు మూవీ గతేడాది థియేటరల్లో రీరిలీజ్ అయినా ఆ సమయంలో పరిమిత సంఖ్యలో స్క్రీన్లలో రిలీజ్ అయింది. ఇప్పుడు మాత్రం రికార్డ్ స్థాయి స్క్రీన్లలో ఈ సినిమా రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. థియేటర్లలో సరైన సినిమా లేని సమయంలో ఒక్కడు సినిమా రీరిలీజ్ అవుతుండటం ఈ సినిమాకు ప్లస్ అవుతోంది.

నిర్మాత ఎమ్మెస్ రాజుకు ఒక్కడు మూవీ అప్పట్లో ఊహించని స్థాయిలో లాభాలను అందించింది. ఇప్పుడు ఈ సినిమా ఏ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది. ఒక్కడు సినిమా ఎన్ని థియేటర్లలో రీరిలీజ్ కానుందో క్లారిటీ రావాల్సి ఉంది.

బటర్ ఫ్లై సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో అలరించిన తెలుగు సినిమాలు ఇవే!

ఇప్పటవరకూ ఎవరు చూడని శ్రీలీల రేర్ ఫోటో గ్యాలరీ!!
‘ఖుషి’ పవన్ ఫ్యాన్స్ కు ఒక డ్రగ్ లాంటిది..రీ రిలీజ్ లో ఎందుకు చూడాలి అంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus