‘దేవర’ సినిమా గ్లింప్స్ వచ్చేసింది. ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు స్పెషల్ డేట్ కూడా ఏమీ లేదు అనే డౌట్ చాలామందికి ఉంది. ఆ విషయం గురించి ఆఖరున మాట్లాడదాం. అయితే ఇప్పుడు చర్చ గ్లింప్స్‌లో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ గురించే చర్చ. గ్లింప్స్ స్టార్టింగ్, మిడిల్ అంతా ఓకే కానీ ఆఖరున వచ్చిన ఫాస్ట్ బీట్ దగ్గరకు వచ్చేసరికే సమస్య వచ్చింది. ఆ బీట్ వింటుంటే ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది. ఆ మాటకొస్తే రెండుసార్లు విన్నట్లు అనిపిస్తుంది.
మామూలుగా అయితే టాలీవుడ్‌లో, ఆ మాటకొస్తే సౌత్ సినిమాలో తన మ్యూజిక్‌ను తనే మళ్లీ వాడేస్తుంటారు అని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్‌కి పేరు. ఆయన కూడా ఒక్కోసారి అలా అయిపోతుంటుంది అని అంటుంటారు కూడా. అయితే ‘దేవర గ్లింప్స్’ చూశాక ఆయనే కాదు అనిరుథ్ కూడా అంతే అనిపించక మానదు. ‘దేవర’ సినిమాకు అనిరుథ్ సంగీతం అందిస్తున్నారు అని టాక్ రాగానే ఫ్యాన్స్ ఎగ్జైట్ అయ్యింది కూడా బీజీఎంలో అనిరుథ్ టాలెంట్ గురించి తెలిసే.
ఇటీవల వచ్చిన ‘జైలర్’ సినిమా ఆ రేంజి విజయం అందుకోవడం ఎలివేషన్ సన్నివేశాల్లో అనిరుథ్ ఇచ్చిన బీజీఎంది కీలక పాత్ర అనే. అయితే ఏమైందో ఏమో ‘దేవర’ విషయానికొచ్చేసరికి ఆయనే గతంలో చేసిన రెండు సినిమాలు బీజీఎంను వాడేశారు అనిఇస్తోంది. విజయ్ నటించిన ‘కత్తి’, ‘బీస్ట్’ సినిమాల్లో హైలైట్‌గా నిలిచన యాక్షన్ సన్నివేశాల బీజీఎంనే ఇప్పుడు ఇక్కడ వాడేశారు అని నెటిజన్లు అంటున్నారు. మీరు మరోసారి వింటే అదే క్లారిటీ వచ్చేస్తుంది కూడా.
ఇక పైన చెప్పినట్లు ఈ సినిమా గ్లింప్స్‌ను ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు అంటే… సినిమా మీద ఇప్పటికే భారీ హైప్ ఉందని, అయితే అది ఇంకాస్త పెరగాలన్నా, బిజినెస్ భారీగా జరగాలన్నా సినిమా ఎలా ఉంటుందో కాస్త రుచి చూపించాల్సిన అవసరం ఉందని టీమ్ అనుకుందట. అందుకే ఓ యాక్షన్ సీన్, (Devara) ‘దేవర’ వరల్డ్, డైలాగ్ పెట్టి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఫలితం ఏంటో త్వరలో తెలుస్తుంది.
ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!
ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!