విజయ్ దేవరకొండ – పరశురామ్ కాంబినేషన్‌లో ఓ సినిమా ఇటీవల ప్రారంభమైంది. ముందుగా అనుకున్న కథతో కాకుండా కొత్త కథతో ఈ సినిమా చేస్తున్నారు అని అంటున్నారు కానీ.. కథ విషయంలో క్లారిటీ లేదు. ముందుగా అనుకున్న పూజా హెగ్డేను కాదని, మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా కాన్సెప్ట్ విషయంలో చిన్నపాటి క్లారిటీ వచ్చింది. ఒకవేళ అదే జరిగితే గతంలో వచ్చిన కాన్సెప్టే. దీంతో అప్పుడేమైంది, ఇప్పుడేమవుతుంది అనేది చర్చనీయాంశంగా మారింది.
‘కుటుంబరావు’ అనే పేరు పెడతారు అంటున్న ఈ సినిమాలో మృణాల్ అమెరికా నుండి వచ్చిన అమ్మాయిగా కనిపిస్తుందట. ఇక్కడి ఆచార వ్యవహారాలు, పద్ధతుల గురించి తెలుసుకునే ఉద్దేశంలో భాగంగా ఓ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకర్తగా మృణాల్ కనిపిస్తుందట. ఈ క్రమంలోనే ఆమె తెలుగు రాష్ట్రాలకు వచ్చి ఇక్కడ డాక్యుమెంటరీ తీస్తుందట. ఈ నేపథ్యంలోనే విజయ్ పాత్ర, మృణాల్ పాత్ర కలుస్తారట. ఆ తర్వాత వీరి మధ్య స్నేహం, ప్రేమ లాంటివి ఉంటాయట.
ఇక విజయ్ (Vijay) పాత్ర నిరుద్యోగి కాగా… ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటూ అమెరికా వెళ్లాలని కలలు కంటుంటాడు. అదే సమయంలో అమెరికా నుండి మృణాల్ పాత్ర వస్తుంది. అలా కలిసిన వీరిద్దరి ప్రయాణమే ఈ సినిమా అంటున్నారు. విజయ్ పాత్రకు పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటుందని, ఆ కుటుంబం మొత్తాన్ని తానే చూసుకోవాల్సి ఉంటుందని కూడా చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాకు ‘కుటుంబరావు’ అనే పేరు పరిశీలిస్తున్నారట.
జీవితంలో కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే హీరో, తన ఇండియన్ – అమెరికా లవ్ స్టోరీ… మధ్య ఈ సినిమా నడుస్తుందట. ఇక ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు సినిమా వెళ్లనున్న నేపథ్యంలో ఇంకొన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. గతంలో నాగచైతన్యకు ఇలాంటి కథనే పరశురామ్ చెప్పారు అని టాక్. మరి అది, ఇది ఒకటో కాదో చూడాలి.
అశ్విన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఆ హీరోయిన్లలా ఫిట్ నెస్ కంటిన్యూ చేయాలంటే కష్టమే?
తన 16 ఏళ్ళ కెరీర్లో కాజల్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!