‘అలనాటి’ హాస్యరస ‘చక్రవర్తులు’!!!

  • April 20, 2016 / 10:56 AM IST

నవ్వడం ఒక భోగం…కానీ నవ్వించడం ఒక యోగం. నిజమే ఒక మినిషిని ఏడిపించాలి అంటే చాలా తేలిక గాని, అదే మనిషిని నవ్వించాలి అంటే దానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఇక అదే సినిమా తెరపై అయితే, నవ్విస్తూ, నవ్వుల్లో ముంచి తెలుస్తూ, ప్రేక్షక దేవుళ్ళను హాస్య రస ప్రియులుగా మార్చే వారే అసలైన హీరోలు. అందులో ముఖ్యంగా ఇప్పటి తరం హాస్య నటులు, కాలానికో, లేక పాత్రలకో పరిమితం అయితే, అప్పటి తరం, అలాంటి హాస్య నటులు పండించిన హాస్యం పది కాలాల పాటు గుర్తుండిపోయేలాగా ప్రేక్షకుల గుండెల్లో వారిని నింపింది. మరి అలాంటి అలనాటి ఆణిముత్యాలను కొందరిని ఒక లుక్ వేద్దాం రండి.

పద్భనాభమ్

దాదాపుగా 400చిత్రాలకు పైగా నటించి మెప్పించిన హాస్య నటుడు. ప్రఖ్యాత దర్శకులు ఎల్వీ ప్రసాద్, కేవీ రెడ్డి లాంటి వారి సినిమాల్లో పనిచేసిన ఘనత ఈ హాస్య నటుడికి దక్కుతుంది. అంతేకాకుండా ఈయన కోసం ఎందరో ప్రముఖ దర్శకులు, రచయితలు, ఆయన శైలికి తగ్గ పాత్రలు రూపొందించారు. షావుకారు, పాతాళ భైరవి సినిమాలతో దాదాపుగా హీరో స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సొంతంగా 8సినిమాలు డైరెక్ట్ చేసి కథానాయిక మొల్ల అనే సినిమాకు గాను నంది అవార్డ్ సైతం అందుకున్నారు.

రేలంగి

బహుశా ఈ తరం వారికి హాస్యరస చక్రవర్తి, తన హాస్యంతో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టించిన హాస్య నటుడు రేలంగి తెలియకపోవచ్చు. ఎందుకంటే దాదాపుగా సినిమా అన్న పధం పుట్టిన తొలినాళ్ళలో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఒకానొక సమయంలో అయితే ఆయన ఏ సినిమాలో నటించినా ఆయన కోసం ఒక ప్రత్యేక గీతాన్ని ప్రేక్షకులు ఉండాలని కోరుకునే వారు, ఇక ప్రేక్షకుల రుచికి తగ్గట్టు దర్శక నిర్మాతలు సైతం అలానే స్పెషల్ సోంగ్ ను తెరకెక్కించేవారు. ఇక మాయాబజార్ సినిమాలో, అలనాటి తార సావిత్రితో కలసి ‘సుందరి నీవంటి దివ్య స్వరూపం’ అన్న పాటలో రేలంగి గారి నటన, ముఖకవళికలు అద్భుతం అంటే అతిశయోక్తి కాదు.

రమణ రెడ్డి

సన్నని ఒళ్ళు, పొడవైన మనిషి, వెరసి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే నైజం. ఇవన్నీ పోత పోసి మనిషి రూపంలో చూస్తే మన రమణా రెడ్డి గారు. 200సినిమాలను పూర్తి చేసుకున్న తొలి నాట కధానాయకుల్లో రమణా రెడ్డి గారు ఒకరు. సినిమాల్లో మ్యాజిక్ చెయ్యడం కోసం మ్యాజిక్ నేర్చుకున్న ఆయన, ఆ తరువాత ఎన్నో మ్యాజిక్ షోస్ చేసి ఆ వచ్చిన డబ్బులను చదువు కోసం, అనాధ సరణాలయాలకు రాసి ఇచ్చేవారు. ఒక వ్యక్తి ఎలా ఆనందంగా బ్రతకాలో, ఎంతవరకూ ఎదిగినా, ఒదిగి ఉండాలో ఆయన జీవితాన్ని చూసి నేర్చుకోవచ్చు.

పద్మశ్రీ అల్లు రామలింగయ్య

కామెడీ కింగ్, విలన్స్ కు పక్కనే ఉంటూ ఆయన చేసే కామెడీ ఎంత ప్రత్యేకమో ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. ముఖ్యంగా ఆయన రావ్గోపాల్ రావు గారితో చేసిన కామెడీకి యావత్ ప్రేక్షక లోకం బ్రహ్మరధం పట్టింది. అప్పటికీ, ఇప్పటికీ మరచిపోనీ కొమెడియన్ మన అల్లు రామ్ లింగయ్యగారు.

రాజబాబు

అలనాటి హాస్య నటుడు, మంచి టైమింగ్ తో సినిమాల్లో కామెడీను పండిస్తూ దూసుకుపోయిన నటుడు రాజబాబు. ఇప్పుడు మనకు బ్రహ్మానందం ఎలాగో అప్పట్లో రాజబాబు కూడా అలానే మంచి టైమింగ్ తో ఆకట్టుకునే వారు. ఎంతో మంది సహా నటులతో ఆయన పండించిన హాస్యం అజరామరం. ముఖ్యంగా రమాప్రభ గారితో  వారి హాస్యం ఇప్పటికీ గుర్తు తెచ్చుకుని మరీ నవ్వుకుంటారు అంటే అతిశయోక్తి కాదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus