‘అతని వయసేంటి.. నీ వయసేంటి… నీ కంటే పెద్ద వాడితో నీకు స్నేహం ఏంటి’… చాలామంది తల్లిదండ్రుల నుంచి ఈ ప్రశ్న ఫేస్ చేసే ఉంటారు. స్నేహం చేసేటప్పుడు వయసు చూడాలా అని మీకు అప్పుడు అనిపించి ఉంటుంది. అందుకే ఇంట్లో తెలియకుండా పెద్ద వాళ్లతో స్నేహం చేసుంటారు. ఇప్పటికీ కొనసాగిస్తుంటారు. అయితే ‘ఇలాంటి చిన్న-పెద్ద స్నేహం మంచిదా.. ’ ఈ ప్రశ్నకు మన మ్యూజింగ్స్ ఫ్రెండ్ పూరి జగన్నాథ్ సమాధానమిచ్చారు. మన కంటే పెద్ద వయసు వారితో స్నేహం చేస్తే ఎన్ని ఉపయోగాలు ఉంటాయో చెప్పుకొచ్చారు. అవి ఆయన మాటల్లోనే…
‘‘చిన్నతనంలో అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యతో గడపటం చాలా బాగుంటుంది. ఆటలు, కథలు, మంచి, చెడూ, పండగలు ఇలా ఎన్నో విషయాలు తెలుసుకోగలుగుతాం. అమ్మానాన్న కంటే ఎక్కువ స్నేహం వారితోనే ఏర్పడుతుంది. అయితే మన వయసు పెరిగేకొద్దీ తెలియకుండానే దూరమైపోతాం. అందుకే పెద్దవాళ్లతో స్నేహం అవసరం. 10, 20 ఏళ్ల వయసు తేడా ఉన్న స్నేహితులు మన జీవితంలో ఉండాలి. వాళ్ల జీవితానుభవాలు మీకు చాలా ఉపయోగపడతాయి. స్నేహ బంధంలో వయసు ఆలోచనే అవసరం లేదు. పెద్దవాళ్లు మనకంటే ఎన్నో తప్పులు చేసుంటారు. మనం చేయబోయేవి కూడా వాళ్లు చూసేసుంటారు. ఈ విషయంలో వారి అనుభవా నుంచి మనం ఎన్నో తెలుసుకోవచ్చు. మన అపరిపక్వత, అనుభవరాహిత్యం వల్ల జీవితంలో జరిగే చాలా అనర్థాలను లెక్క చేయరు. పెద్ద వాళ్లతో స్నేహం చేస్తే వీటిని మీకు తెలిసేలా చేస్తారు’’ అని చెప్పుకొచ్చారు పూరి.
‘‘పెద్దవాళ్లతో ఉంటే వాళ్ల ప్రశాంతత మీకు అలవాటవుతుంది. ప్రతి విషయాన్ని మరో కోణంలో చూస్తారు. మీలో కోపం కూడా తగ్గుముఖం పడుతుంది. జీవితంలో ఏది ముఖ్యమో అర్థమవుతుంది. మేము యూత్ కదా.. మాకు సీనియర్స్ సలహాలు ఎందుకులే అని ఎప్పుడూ అనుకోవద్దు. పెద్దవాళ్లు కనిపిస్తే స్నేహం చేసుకోండి. పబ్‌లో అమ్మాయి కనిపిస్తే నంబర్ తీసుకునే అవకాశం మీకొస్తుంది. అయితే అలా నంబర్ తీసుకుంటే ఎలా మీ సరదా తీరిపోతుందో మీ కంటే పెద్ద వయసున్న స్నేహితుడు చెబుతాడు’’ అని పూరి చెప్పుకొచ్చారు.
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!