Om Bheem Bush Collections: బ్రేక్ ఈవెన్ సాధించి క్లీన్ హిట్ గా నిలిచిన ‘ఓం భీమ్ బుష్’ ..!

  • May 26, 2024 / 09:31 PM IST

‘బ్రోచేవారెవరురా’ (Brochevarevarura) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శ్రీవిష్ణు(Sree Vishnu),ప్రియదర్శి(Priyadarshi) , రాహుల్ రామకృష్ణ (Rahul Ramakrishna) కాంబినేషన్లో రూపొందిన సినిమా ‘ఓం భీమ్ బుష్’ (Om Bheem Bush). ‘హుషారు’ (Husharu)  ఫేమ్ శ్రీహర్ష కొనుగంటి (Sree Harsha Konuganti) దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘వి సెల్యులాయిడ్’, సునీల్ బలుసు కలిసి నిర్మించగా…, ‘యూవీ క్రియేషన్స్’ సంస్థ సమర్పించింది. మార్చి 22న వరల్డ్ వైడ్ గా ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.

మొదటి షోతోనే పాజిటివ్ టాక్ ను రాబట్టుకుంది. కలెక్షన్స్ కూడా బాగా వచ్చాయి. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.45 cr
సీడెడ్ 0.76 cr
ఉత్తరాంధ్ర 0.70 cr
ఈస్ట్ 0.29 cr
వెస్ట్ 0.24 cr
గుంటూరు 0.47 cr
కృష్ణా 0.61 cr
నెల్లూరు 0.21 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 6.73 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.00 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 8.73 cr (షేర్)

‘ఓం భీమ్ బుష్’ చిత్రానికి రూ.6.56 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.6.8 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా రూ.8.73 కోట్లు షేర్ ను రాబట్టి… రూ.1.93 కోట్ల ప్రాఫిట్స్ ను అందించింది.

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus