ఆదిపురుష్ ట్రైలర్ పై ఓం రౌత్ షాకింగ్ కామెంట్స్.. ఏమన్నారంటే?

టీ సిరీస్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలలో ఆదిపురుష్ సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. దాదాపుగా 600 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కగా ఇప్పుడిప్పుడే ఈ సినిమాపై పాజిటివిటీ పెరుగుతోంది. త్వరలో ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది. మే నెల 4వ తేదీన లేదా మే నెల 17వ తేదీన ఈ మూవీ ట్రైలర్ విడుదల కానుందని సమాచారం. త్వరలో ట్రైలర్ రిలీజ్ కు సంబంధించి అధికారిక ప్రకటన చేయనున్నారు.

తాజాగా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించగా ఆ విషయాలు వైరల్ అవుతున్నాయి. అతి త్వరలోనే ఆదిపురుష్ మూవీ ట్రైలర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని ఓం రౌత్ అన్నారు. ఆదిపురుష్ మూవీ ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై కచ్చితంగా అంచనాలు పెరుగుతాయని ఆయన చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ యూనిట్ ఈ సినిమా రిజల్ట్ పై కాన్ఫిడెన్స్ తో ఉందని ఓం రౌత్ కామెంట్లు చేశారు.

ఆదిపురుష్ సినిమాతో కచ్చితంగా బ్లాక్ బస్టర్ సాధిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మరో 45 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సాహో, రాధేశ్యామ్ తర్వాత ప్రభాస్ నటించి విడుదలవుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. త్వరలో ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనున్నారు. కృతిసనన్ ఈ సినిమాలో సీత రోల్ లో కనిపించడం గమనార్హం.

ఆదిపురుష్ సినిమా సక్సెస్ సాధిస్తే ప్రభాస్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. బాహుబలి2 తర్వాత ప్రభాస్ ఖాతాలో ఆ రేంజ్ హిట్ చేరలేదు. ప్రభాస్ డీసెంట్ హిట్ సాధించినా సంతోషంగా ఫీలవుతామని ఫ్యాన్స్ చెబుతున్నారు. గతంతో పోల్చి చూస్తే ఆదిపురుష్ కు బెటర్ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. తర్వాత సినిమాలతో ప్రభాస్ హ్యాట్రిక్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus