‘మేము పవన్ కళ్యాణ్ సినిమాని ఏమీ టార్గెట్ చేయడం. ఆయన చేసేది ఏడాదికి ఒక సినిమా. ఆయన సినిమాకి అల్లు అర్జున్, రాంచరణ్, చిరంజీవి వంటి హీరోల సినిమాల కంటే కూడా ఎక్కువ కలెక్షన్లు వస్తాయా. అప్పుడెప్పుడో ‘అత్తారింటికి దారేది’ హిట్ అయ్యిందని.. తర్వాత సినిమాలన్నిటికీ అదే హడావిడి ఉంటుందా ఏంటి’ అంటూ పేర్ని నాని మొన్నామధ్య చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన ‘బంగార్రాజు’ సక్సెస్ మీట్ కు వెళ్ళి ఆ టీం ను అభినందించారు.
ఈ వెర్షన్ పక్కన పెడితే… ‘బంగార్రాజు’ సినిమాకి ఆంధ్రలో చాలా చోట్ల రూ.200 టికెట్ రేట్లు అమ్మారు. ఆ థియేటర్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే.. ఈ సినిమాకి స్పెషల్ పర్మిషన్ ఉంది.పైగా ఇది వైసిపి పార్టీకి చెందిన ఓ నాయకుడి థియేటర్ అంటూ సమాధానం ఇచ్చాడు. ఇది పక్కన పెడితే.. ఆ పక్కనే ఉన్న థియేటర్లలో కూడా ‘బంగార్రాజు’ కి రూ.200 టికెట్ రేట్లు అమ్మారు. మరి ఆ థియేటర్ ఎవరిదో తెలీదు.
అయితే రేపు విడుదల కాబోతున్న ‘భీమ్లా నాయక్’ కు ఆ థియేటర్లలో కేవలం రూ.70 టికెట్ ధర మాత్రమే ఉంది. పోనీ ‘బంగార్రాజు’ కి ఇచ్చినట్టు అడ్వాన్స్ బుకింగ్స్ ఇస్తున్నారా అంటే అదీ లేదు. ఇలాంటి దారుణాలు ఆంధ్రలో చాలానే జరుగుతున్నాయి. అధికార పార్టీ … పవన్ కళ్యాణ్ సినిమా పై కక్ష్య సాధింపు చర్యలు చేపడుతుంది అందానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. నాగార్జున కంటే కూడా పవన్ కళ్యాణ్ కు 5 రెట్ల మార్కెట్ ఎక్కువగా ఉంది.
బిజినెస్ కూడా ‘బంగార్రాజు’ కంటే కూడా 4 రెట్లు ఎక్కువగా ‘భీమ్లా’ కి జరిగింది. అలాంటప్పుడు ఇలాంటి పెద్ద సినిమాకి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది బాధ్యత కూడా..!
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!