Balakrishna Remuneration: మళ్లీ రెమ్యునరేషన్ పెంచిన బాలయ్య.. ఎంతంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణకు ఊహించని స్థాయిలో క్రేజ్ ఉండగా వరుస విజయాలు బాలయ్య స్థాయిని మరింత పెంచాయి. కొన్ని నెలల క్రితం వరకు పరిమితంగా రెమ్యునరేషన్ ను తీసుకున్న బాలయ్య ప్రస్తుతం 20 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారని సమాచారం అందుతోంది. బాలయ్యతో సినిమా తీయాలంటే ఆ రేంజ్ పారితోషికం ఇవ్వాల్సిందేనని సమాచారం.

అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాకు 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను తీసుకున్న బాలయ్య తన పారితోషికాన్ని పెంచడం హాట్ టాపిక్ అవుతోంది. అయితే పెరుగుతున్న మార్కెట్ కు అనుగుణంగా బాలయ్య తన పారితోషికాన్ని పెంచుతున్నారని బాలయ్య రెమ్యునరేషన్ ను పెంచడంలో తప్పేం లేదని కొంతమంది సోషల్ మీడియా వేదికగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్యకు మాస్ ప్రేక్షకుల్లో ఊహించని రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటంతో వయస్సు పెరుగుతున్నా బాలయ్య హవా ఊహించని స్థాయిలో పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. బాలయ్యకు జోడీగా నటించడానికి స్టార్ హీరోయిన్లు సైతం క్యూ కడుతున్న పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. బాలయ్య సైతం తర్వాత సినిమాలతో బాక్సాఫీస్ ను షేక్ చేయాలని అనుకుంటున్నారు.

బాలయ్య గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో మరో సినిమాకు సంబంధించిన ప్రకటన వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ వీరసింహారెడ్డి బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించే అవకాశాన్ని కొన్ని పొరపాట్ల వల్ల మిస్ చేసుకుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి..

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus