Balakrishna: భారీగా రెమ్యూనరేషన్ పెంచిన బాలయ్య?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్యకు నిర్మాతల హీరో అనే గుర్తింపు ఉందని చెప్పాలి. రెమ్యూనరేషన్ల విషయంలో ఇతర హీరోల మాదిరి ఈయన నిర్మాతలను ఇబ్బంది పెట్టరని ఈయనకు మంచి పేరు ఉంది. అందుకే బాలయ్యను నిర్మాతల హీరో అంటూ పిలుస్తుంటారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో వరుస హిట్ సినిమాలను అందుకోవడంతో బాలకృష్ణ కూడా తన రెమ్యూనరేషన్ పెంచారని తెలుస్తుంది.

ఒకానొక సమయంలో వరుస ప్లాప్ సినిమాలను ఎదుర్కొన్నటువంటి (Balakrishna) బాలకృష్ణ కేవలం 10 కోట్ల రూపాయల వరకు మాత్రమే రెమ్యునరేషన్ అందుకున్నారట. ఈ విధంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నటువంటి ఈ సీనియర్ హీరో అనంతరం లెజెండ్, అఖండ, వీరసింహారెడ్డి వంటి వరుస హిట్ సినిమాలతో తన రెమ్యూనరేషన్ కూడా పెంచారని తెలుస్తుంది.గోపీచంద్ మలినేనీ దర్శకత్వంలో వచ్చిన వీర సింహారెడ్డి సినిమా మంచి సక్సెస్ ఆయన సంగతి మనకు తెలిసిందే ఈ సినిమా కోసం బాలయ్య 15 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్నారట.

ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఈయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నటువంటి భగవంత్ కేసరి సినిమా కోసం 20 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే బాలకృష్ణ జూన్ 10వ తేదీ తన పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. తన పుట్టినరోజు సందర్భంగా ఈయన తన కొత్త చిత్రాన్ని ప్రకటించారు. వాల్తేరు వీరయ్య సినిమాతో మంచి హిట్ అందుకున్నటువంటి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేయబోతున్నారని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన పూజా కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారు ఇక ఈ సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా 25 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నారని సమాచారం.ఇక ఎప్పటినుంచో బాలకృష్ణతో సినిమా చేయాలని నాగ వంశీ కల ఈ సినిమాతో నెరవేరబోతుందని తెలుస్తుంది. ఇక చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా కోసం పనిచేసిన టీం మొత్తం బాలయ్య సినిమాకు కూడా పనిచేయబోతున్నట్లు తెలుస్తుంది.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus