Bommarillu Bhaskar: యువ హీరోకి కథ రెడీ చేయమన్న అల్లు అరవింద్‌

ఎన్ని ప్రయత్నాలు చేసినా… సరైన హిట్‌ కొట్టేకపోతున్న దర్శకులకు గీతా ఆర్ట్స్‌ మంచి ఆప్షన్‌ అంటుంటారు టాలీవుడ్‌లో. చాలామంది యువ దర్శకులు ఇలా గీతా ఆర్ట్స్‌కు వచ్చి మళ్లీ హిట్‌ ట్రాక్‌ ఎక్కినవాళ్లే. మొన్నామధ్య ‘గీత గోవిందం’తో పరశురామ్‌ హిట్ కొట్టి… ఏకంగా మహేష్‌ సినిమా ఛాన్స్‌ కొట్టేశాడు. ఇప్పుడు ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో బొమ్మరిల్లు భాస్కర్‌ అదే పని చేశాడు. అంతేకాదు తర్వాతి సినిమా కూడా గీతా ఆర్ట్స్‌లోనే చేస్తాడని టాక్‌.

ఓ యంగ్‌ హీరో కోసం కథ సిద్ధం చేసుకో అని బొమ్మరిల్లు భాస్కర్‌ గీతా ఆర్ట్స్‌ నుండి ఇటీవల పిలుపు వచ్చింది. ‘..బ్యాచ్‌లర్‌’ విజయంతో భాస్కర్‌ చాలా రోజుల నిరీక్షణకు తెరపడింది. ఇప్పుడు మరో కథతో కుస్తీపడుతున్నాడన్నమాట. అయితే ఈసారి కూడా ‘గీత’లోనే ఉండి సినిమా చేస్తాడా? లేక ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేకుండా పక్కాగా కథ సిద్ధం చేసుకొని సినిమా చేస్తాడా అనేది చూడాలి. అయితే ఇప్పుడు భాస్కర్‌ సినిమా చేయబోయేది ఎవరితో అనే చర్చ కూడా మొదలైంది.

గీతా ఆర్ట్స్‌ దగ్గర యువ హీరోల డేట్లు ఉన్నాయి. అలాంటివారిలో కార్తికేయ, విజయ్‌ దేవరకొండ, నిఖిల్‌ లాంటివాళ్లు ఉన్నారంటున్నారు. అయితే శిరీష్‌ కెరీర్‌ను కూడా బిల్డ్‌ చేయాల్సి ఉంది. దీంతో ఆ యువ హీరోల కోసమా ఈ కథ, లేక శిరీష్‌ కోసమా అనేది తెలియడం లేదు. చూద్దాం భాస్కర్‌ ఏ కథ చేస్తాడో, ఎవరితో చేస్తాడో?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus