Chiranjeevi, Ram Charan: మరోసారి ఒకే ఫ్రేమ్ లో చరణ్ – చిరు!

మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ కలయికలో వస్తున్న మొదటి సినిమా ఆచార్యపై అంచనాలు ఏ స్థాయిలో పెరుగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్లాస్ కమర్షియల్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్టులు కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన మేజర్ షూటింగ్ మొత్తం పూర్తయింది. కేవలం రెండు పాటలు షూట్ మాత్రమే మిగిలి ఉంది. రిలీజ్ వాయిదా పడటం వల్ల చిత్రయూనిట్ మధ్యలోనే పాటలకు సంబంధించిన షూటింగ్ కూడా నిలిపి వేయడం జరిగింది.

ఫైనల్ గా మరికొన్ని రోజుల్లో ఆ పనులు కూడా పూర్తి చేయాలని మెగాస్టార్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే మళ్ళీ గాడ్ ఫాదర్ తో బిజీ అయితే ఖాళీ ఉండదు అని అందుకే వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి కి మధ్యలో ఒక పాటను చిత్రీకరించాల్సి ఉంది. ఇక చాలా రోజుల తర్వాత మెగా స్టార్ చిరంజీవి తనయుడు తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు.

మరో వైపు రామ్ చరణ్ కూడా వచ్చే నెలలో శంకర్ సినిమాతో బిజీగా ఉన్నాడు కాబట్టి ఆచార్య పనులను వెంటనే పూర్తి చేసుకోవాలని అనుకుంటున్నాడు. రామ్ చరణ్ పూజా హెగ్డే కాంబినేషన్లో కూడా ఒక రొమాంటిక్ సాంగ్ ను పూర్తిచేయాల్సి ఉంది. అలాగే ఆ పాటను విడుదల కూడా చేయాలని అనుకున్నారు. ఇప్పుడు దర్శకుడు కొరటాల శివ నెక్స్ట్ అప్డేట్ ఎప్పుడు ఇస్తాడో చూడాలి.

నెట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus