Fahadh Faasil: ‘జైలర్ 2’ లో మెయిన్ విలన్ గా ఫహాద్ ఫాజిల్…?

ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil). తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ‘విక్రమ్’ (Vikram) ‘పుష్ప’ (Pushpa) ‘పుష్ప 2’ (Pushpa 2)  సినిమాలతో ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. దీంతో ఇతని పాత సినిమాల శాటిలైట్ హక్కులను పలు సంస్థలు కొనుగోలు చేసి డబ్బింగ్ చేయించుకుని టీవీల్లో ప్రసారం చేస్తుండటం అనేది చూస్తూనే ఉన్నాం. ఇదిలా ఉండగా.. తెలుగులో ఇతను మరో సినిమా చేయడానికి సిద్ధంగా లేనట్లు మలయాళ మీడియా వర్గాల సమాచారం. ఎందుకంటే ‘పుష్ప’ ప్రాజెక్టుతో ఇతను సంతృప్తి చెందలేదట.

Fahadh Faasil

ఎక్కువ పారితోషికం ఆఫర్ చేయడం వల్లే అతను ‘పుష్ప 2’ లో నటించడానికి ఒప్పుకున్నాడట. కానీ సినిమాలో అతని పాత్రని సరిగ్గా డిజైన్ చేయకపోవడం, సరైన కన్క్లూజన్ కూడా ఇవ్వకపోవడంతో అతను డిజప్పాయింట్ అయినట్టు వినికిడి. అయితే తమిళ సినిమాల్లో నటించడానికి మాత్రం ఫహాద్ చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని టాక్ వినిపిస్తోంది. తెలుగు కంటే ఎక్కువగా తమిళ ఫిలిం మేకర్స్ కథలు చెప్పడానికి వస్తే..

అతను టైం ఇస్తున్నాడట. ఇదిలా ఉండగా.. ఫహాద్ ఇప్పటికే రజినీకాంత్ తో (Rajinikanth)  కలిసి ‘వేట్టయన్’ (Vettaiyan) సినిమాలో నటించాడు. అందులో అతని పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. దాదాపు రజినీకాంత్ పక్కనే ఉండే పాత్ర అది. ఫహాద్ డిసిప్లిన్ కు కూడా రజినీకాంత్ ఫిదా అయిపోయారట.

అందువల్ల ‘జైలర్ 2’ సినిమాలో కూడా ఫహాద్ ను రిఫర్ చేసినట్టు ఇన్సైడ్ టాక్. ‘జైలర్’ లో (Jailer)  మెయిన్ విలన్(వినాయగన్ పాత్ర) మరణిస్తుంది. అతను చనిపోయే ముందు విగ్రహాల స్కాములు, డ్రగ్స్ స్కాములు వెనుక వేరే వ్యక్తి ఉన్నట్లు చెబుతాడు. సో ఆ ఇంకో వ్యక్తి పాత్ర ఫహాద్ ఫాజిల్ అయ్యి ఉండొచ్చు అని సమాచారం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus